ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన పెట్టుబడులు రావు

ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన పెట్టుబడులు రావు

వైసీపీ అధినేత జగన్‌ ఏపీ సీఎం చంద్రబాబుకు చురకలు వేశారు.  రాష్ట్రంలో వివిధ నేపథ్యాల్లో జరుగుతున్న అల్లర్లు, హింసకు వైసీపీయే కారణమని.... ఆ ప్రభావంతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతమేర్పడి పెట్టుబడులు రాకుండాపోయే ప్రమాదముందని చంద్రబాబు పదేపదే అంటున్న నేపథ్యంలో ఆయన కౌంటర్‌ ఇచ్చారు. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో మాట్లాడుతూ పెట్టుబడుల సాధనకు కావాల్సింది ప్రశాంతత కాదని... రాయితీలు ఇస్తే పెట్టుబడులు అవే వస్తాయని అన్నారు.

ఇతర రాష్టాలకు పెట్టుబడులు వస్తున్నాయంటే అవన్నీ శాంతియుతంగా ఉన్నాయని అర్థం కాదన్నట్లుగా మాట్లాడారు. రాయితీలు ఇస్తే పెట్టుబడులు అవే వస్తాయని చంద్రబాబుకు సూచించారు. చైనా, దావోస్‌, సింగపూర్‌ వెళ్తే పెట్టుబడులు రావని... ఇక్కడికి వచ్చేవారికి, ఇక్కడి వారికి రాయితీలు ఇస్తే పెట్టుబడులు వాటికవే వస్తాయని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని.. అప్పుడు ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుందని, అప్పుడు సింగపూర్‌, చైనా, దావోస్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్న జగన్‌ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడం మానేసి తనను నిందిస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. విభజన వేళ లక్షా 40వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారని, అమలు చేయడం మరిచారని విమర్శించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English