తెలంగాణకు మళ్ళీ దెబ్బేసారే!

తెలంగాణకు మళ్ళీ దెబ్బేసారే!

దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిన నగరాల జాబితాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొద్ది సేపటి కిందట విడుదల చేశారు. స్మార్ట్‌ సిటీలుగా ఎంపికైతే అభివృద్ధికి అవకాశమేర్పడుతుందని.. కేంద్రం నుంచి అండ ఉంటుందన్న ఉద్దేశంతో పలు నగరాలు దీనికి పోటీ పడ్డాయి.

ఏపీ నుంచి విశాఖ, కాకినాడ, తిరుపతిలు స్మార్ట్‌ సిటీల రేసులో నిలిచాయి. అయితే... మొదట విడతలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేవలం 20 నగరాలకే అవకాశమిస్తుండడంతో ఎన్నిటికి అవకాశమొస్తుందో అని ఆందోళన చెందారు. కానీ, తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కాకినాడ, విశాఖపట్నంలు స్మార్ట్‌ సిటీలుగా ఎంపికయ్యాయి.

కాగా తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా ఎంపిక కాలేదు. దేశవ్యాప్తంగా విశాఖ, కాకినాడలతో పాటు జైపూర్‌, పుణే, అహ్మదాబాద్‌, ఇండోర్‌,  షీపూర్‌, జబల్‌ పూర్‌, దావణగెరె, భువనేశ్వర్‌, సూరత్‌, కోచి, కోయంబత్తూరు, చెన్నయి, లూథియానా, అహ్మదాబాద్‌, గౌహతి, ఉదయ్‌ పూర్‌, బెల్గాం, ఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌ లు ఎంపికయ్యాయి.

కాగా మొదటి విడతలో స్మార్టు సిటీలుగా ఎంపికైన ఈ 20 నగరాల్లో 3.54 కోట్ల జనాభా ఉంది. వచ్చే అయిదేళ్లలో ఈ నగరాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి కోట్లు ఖర్చు చేయనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English