వారంలో పాస్‌ పోర్ట్‌.. వెరీ సింపుల్‌

వారంలో పాస్‌ పోర్ట్‌.. వెరీ సింపుల్‌

పాస్‌ పోర్ట్‌ కావాలంటే ఎన్నో తిప్పలు, వెరిఫికేషన్ల పేరిట నెలల తరబడి జాప్యం. వెరిఫికేషన్‌ కు వచ్చేవారికి ఎంతో కొంత చెల్లించుకోవాల్సి రావడం. దీంతో పాస్‌ పోర్టు అంటే ప్రయాసే అన్నది ప్రస్తుత పరిస్థితి. కానీ, కేంద్ర విదేశాంగ శాఖ పాస్‌ పోర్టు నిబంధనలను సరళతరం చేస్తోంది. వారంలో పాస్‌ పోర్టు పొందేందుకు సులభమార్గం  రూపొందించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌ లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఇకపై పాస్‌ పోర్టు కావాలంటే నాలుగు పత్రాలుంటే చాలు. ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, పాన్‌ కార్డుకార్డు.. వాటితో పాటు వ్యక్తిగత వివరాలు ధ్రువీకరించే అఫిడవిట్‌. ఈ నాలుగు పత్రాలు జిరాక్స్‌ లు పెట్టి అప్లికేషన్‌ ఇస్తే వారంతో రోజుల్లో పాస్‌ పోర్టు వచ్చేస్తుంది. ప్రస్తుతం పాస్‌ పోర్టు దరఖాస్తుల జారీకి సంబంధించి పోలీస్‌ వెరిఫికేషన్‌ కే సమయం పడుతోంది. కనీసం నెలరోజులైనా పడుతోంది. తాజా నిర్ణయంతో వారం రోజుల్లో పాస్‌ పోర్టు చేతికొచ్చేస్తుంది.

అయితే... ఆధార్‌ దేనికీ తప్పనిసరి కాదని కోర్టులు చెబుతున్న తరుణంలో ప్రభుత్వం ఇలా ఆధార్‌ ప్రధానంగా పాస్‌ పోర్టు జారీని మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు చెప్పడానికి సులభ విధానమని అంటున్నా అధికారులు ఇందులో ఎలాంటి మెలిక పెడతారో అని ఆందోళన చెందుతున్నారు. ఎన్ని నిబంధనలు మార్చినా చేతి చమురు వదిలించుకోకుండా పాస్‌ పోర్టు చేతికి రాదని అంటున్నారు.?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు