రిపబ్లిక్‌ డే వేడుకల్లో తొలిసారి విదేశీ సైన్యం

రిపబ్లిక్‌ డే వేడుకల్లో తొలిసారి విదేశీ సైన్యం

ఢిల్లీలో జరుగుతున్న భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేక విశిష్టతలను సంతరించుకున్నాయి. గణతంత్ర వేడుకల సందర్భంగా సైనికులు నిర్వహించే కవాతులో మునుపెన్నడూ లేనట్లుగా ఈ ఏడాది తొలిసారి ఫ్రెంచ్‌ సైన్యం పాల్గొంది. 76 మంది ఫ్రెంచి సైనికులు కవాతులో పాల్గొన్నారు.  ఒక విదేశీ సైన్యం భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి.

అంతేకాదు... త్రివిధదళ సైనికుల కవాతులో డాగ్‌ స్వ్కాడ్‌తో సైనికులు చేసిన పరేడ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 26 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో ఇలా డాగ్‌ స్వ్కాడ్‌ కవాతు నిర్వహించారు.  రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే వందనం సమర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అమరవీరుల కుటుంబ సభ్యులకు పురస్కారాలు అందజేస్తున్నారు.

మరోవైపు రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో అడుగడుగునా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేశారు. సుమారు 40 వేల మంది పోలీసులు, పారా మిలటరీ బలగాలు మోహరించారు. రాజ్‌పథ్‌ వద్ద కవాతు నిర్వహించే మార్గంలో సాయుధ బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు. రాజ్‌పథ్‌ సమీపంలోని 45 భవంతులను ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రోన్‌ కెమెరాలతో భద్రతను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ మీదుగా విమానాల రాకపోకలనూ నిలిపివేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు