'టైమ్స్‌' కన్నా 'ఈనాడు' కే పెద్దది

'టైమ్స్‌' కన్నా 'ఈనాడు' కే పెద్దది

''ఈనాడు''కు పద్మవిభూషన్‌.. ''టైమ్స్‌''కి పద్మభూషణ్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పద్మ పురస్కారాలు ప్రకటించటం తెలిసిందే. అయితే.. ఈసారి ప్రకటించిన పద్మ పురస్కారాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. రెండు ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన అధినేతలకు పద్మ పురస్కారాలు దక్కటం గమనార్హం.

ఆసక్తికరంగా జాతీయ మీడియాలో తనదైన ముద్ర వేసే టైమ్స్‌ గ్రూప్‌ తో పాటు.. మీడియా మొఘల్‌ గా పేరొన్న ఈనాడు సంస్థల అధినేతకు పద్మ పురస్కారం లభించటం విశేషం. చిత్రమైన విషయం ఏమిటంటే.. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న టైమ్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఇందూ జైన్‌ కు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. సామాజిక సేవా కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపట్టే నేపథ్యంలో పద్మ పురస్కారం ప్రకటించినట్లు చెబుతున్నారు. అదే సమయంలా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్‌ పురస్కారం లభించటం గమనార్హం..

రెండు ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలు దక్కటం.. టైమ్స్‌ కంటే ఈనాడు అధిపతికి దేశంలో రెండో అత్యున్నత పురస్కారం లభించటం చూసినప్పుడు కాస్త ఆసక్తికరంగా అనిపించక మానదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు