ఆమె జీవితం లో ఇంకెప్పుడూ డ్రైవింగ్‌ చేయకూడదు

ఆమె జీవితం లో ఇంకెప్పుడూ డ్రైవింగ్‌ చేయకూడదు

కొన్ని తప్పులు ఏ మాత్రం క్షమారమైనవి కావు. అలాంటి తప్పే చేశారు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ లో వైఎస్‌ ప్రెసిడెంట్‌ (లీగల్‌)గా పని చేసే జాహ్నవి గడ్కర్‌. 35 ఏళ్ల ఈ మహిళా న్యాయవాది పెద్ద తప్పే చేశారు. పూటుగా తాగేసి.. నిర్లక్ష్యంగా కారు నడిపిన ఆమె.. తన ఆడి క్యూ 3 మోడల్‌ కారుతో రాంగ్‌ రూట్‌ లో నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యారు.

ఈ దారుణ ఘటన గత ఏడాది జూన్‌ 10న చోటు చేసుకుంది. ఆమె కారులో అమిత వేగంతో వెళుతూ మరో కారును ఢీ కొట్టటం.. అందులో ప్రయాణిస్తున్న మహ్మద్‌ సలీం సాబూవాలా.. మహ్మద్‌ హుస్సేన్‌ సయూద్‌ అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు జాహ్నవి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ను ముంబయి ఆర్టీవో ఆమె డ్రైవింగ్‌ లైసెన్స్‌ ను జీవితకాలం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ శిక్ష సమంజసమే అయినప్పటికీ.. ఇద్దరు అమాయకుల మృతికి ఈ శిక్ష సరిపోయినట్లేనా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు