అసెంబ్లీ రెడ్‌లైట్‌ ఏరియా అంటున్నారు

అసెంబ్లీ రెడ్‌లైట్‌ ఏరియా అంటున్నారు

ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల తీరు గురించి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అసెంబ్లీ గురించి బూతు కామెంట్లు చేసినా స్పందించలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శాసన సభలో నైతిక ప్రమాణాలు పెంచేందుకు మేధావులు, న్యాయకోవిదులు, రిటైర్డ్‌ అధికారులు, మీడియా సలహాలు సూచనలు తీసుకునేందుకు హైదరాబాద్‌లోని శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో కోడెల ఘాటుగా ప్రసంగించారు.

అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు (లైవ్‌ టెలీకాస్ట్‌) పెట్టిన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అది వక్రమార్గంలో వెళుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏడాదికి 40 నుంచి 50 రోజులు జరిగినా ఆ చర్చల విలువ ఏడాది పొడుగునా ఉంటుందన్నారు. పార్టీల విమర్శలు పార్లమెంటరీ భాషలోనే ఉండాలని హితవు పలికారు. ప్రస్తుతం సభ సాగుతున్న తీరుతో సమాజంలోని పలువురు వ్యక్తులు నఅసెంబ్లీ రెడ్‌లైట్‌ ఏరియా, శాసనసభ అల్లరిమూకల అడ్డా న అంటూ ఎద్దేవా చేస్తున్నా వాటిపై గట్టిగా స్పందించలేని పరిస్థితి ఏర్పడిందని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలు బాధాకరమైన వాతావరణంలో సాగుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 175 సభ్యులుంటే కేవలం 46 మంది మాత్రమే తమ ఆస్తుల వివరాలను సమర్పించారని తెలిపారు. ఇది అశ్రద్ధ కావచ్చు, లెక్కలేనితనం కావచ్చని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. సభ్యుల ఆస్తుల వివరాలను గోప్యంగానే ఉంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు చోట్ల ఎథిక్స్‌ కమిటీ వివిధ వర్గాలతో సమావేశమైందని, ఈ కమిటీ సిఫారసులను అసెంబ్లీ పరిశీలనకు పంపుతామన్నారు. సభా గౌరవాన్ని పెంచే విధంగా ప్రతిపాదనలు ఉంటాయని....సభ్యులు ఇందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఆకాంక్షించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English