దీపావళికి అమెరికా స్కూల్లో సెలవు

దీపావళికి అమెరికా స్కూల్లో సెలవు

విభిన్న సంప్రదాయాలకు ప్రాశ్చాత్య దేశాల గుర్తింపు లభించటం అంత తేలికైన విషయం కాదు. అందుకు భిన్నంగా తాజాగా భారతీయులు అత్యంత వేడుకగా జరుపుకునే దీపావళి పండక్కి అమెరికాలో సరికొత్త గుర్తింపు లభించింది. ఆ దేశంలో దీపావళి పండక్కి ఒక స్కూల్‌ సెలవిస్తూ నిర్ణయం తీసుకుంది.

అమెరికాలోని హోవార్డ్‌ కౌంటీ పబ్లిక్‌ స్కూల్‌ కు సంబంధించి రూపొందించే వార్షిక క్యాలెండర్‌ లో దీపావళి పండక్కి సెలవు ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి హిందువులు అత్యంత ఉల్లాసంగా జరుపుకునే దీపావళి పండగను అమెరికా స్కూల్‌ గుర్తించటమే కాదు.. పండగ సందర్భంగా స్కూల్‌ కి సెలవు ప్రకటించటంపై భారతీయులు పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English