కోడి పందేలకు.. డ్రోన్లు.. ఎల్‌ఈడీ స్క్రీన్‌ లు.. వాకీటాకీలు

కోడి పందేలకు.. డ్రోన్లు.. ఎల్‌ఈడీ స్క్రీన్‌ లు.. వాకీటాకీలు

ఏపీలో కోడి పందాలు ఎంత జోరుగా సాగుతున్నాయో తెలిస్తే నోటి వెంట మాట రాదంతే. డిజిటల్‌ ప్రపంచానికి తగ్గట్లు సంప్రదాయంగా నిర్వహించే కోడి పందాల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పందాల్లో లక్షల్లో చేతులు మారనున్న నేపథ్యంలో.. పందాలు నిర్వహేంచే బరుల దగ్గర ఏర్పాట్లు చూసినోళ్ల నోట వెంట మాట రాని పరిస్థితి.

కోడి పందాల్ని చిత్రీకరించేందుకు వీలుగా బుజ్జి.. బుజ్జి డ్రోన్లు ఆకాశంలో ఎగురుతూ రికార్డు చేస్తున్నాయి. మరోవైపు.. పోటీ నిర్వహణకు.. పోటీలకు వస్తున్న ప్రముఖులు.. వారి పార్కింగ్‌ తదితర అంశాలకు సంబంధించి వాకీటాకీలు చేతబట్టిన ప్రైవేటు సెక్యూరిటీలతో పాటు.. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయటం.. పోటీలు తిలకించేందుకు వచ్చే వేలాది మందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు లాంటివి చేస్తున్నారు.

పొద్దున్నే మొదలయ్యే పోటీలు రాత్రి వరకూ నిర్విరామంగా సాగటం.. సాయంత్రం దాటితే ఫ్లడ్‌ లైట్ల సందడితో పొద్దుపోయే వరకూ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాల్లో విజేతలుగా నిలిచిన వారి బహుమతులు కూడా భారీగానే ఉన్నాయి. హోండా సిటీ.. ఐ 20.. ఐ10 కార్లను అందించటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు