గ్రేటర్‌ వార్‌ కు చినబాబు కూడా దూరమేనా?

గ్రేటర్‌ వార్‌ కు చినబాబు కూడా దూరమేనా?

బతక నేర్చడంలో చాలా సూత్రాలుంటాయి.. ఎక్కడ తగ్గాలో తెలియడం కూడా బతక నేర్చడంలో ఒక టెక్నిక్కే. ఇప్పుడు టీడీపీ చినబాబు లోకేశ్‌ కూడా కాస్త ఆలస్యంగానైనా ఈ సూత్రాన్ని గ్రహించారు. అందుకే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఎక్కువ చేసి భంగపడరాదన్న ఉద్దేశంతో వెనక్కు తగ్గుతున్నారాయన. నిజానికి చంద్రబాబు ముందే డ్రాపయ్యారు. తన బదులు కుమారుడు లోకేశ్‌ ఏమైనా చేయగలడేమో అన్న ఉద్దేశంతో ఆయన్ను ముందుకు తోశారు. అయితే.. సీనంతా చూశాక లోకేశ్‌ కూడా తాను తగ్గడమే బెటరన్న నిర్ణయానికి వచ్చారట.

అందుకే గ్రేటర్‌ ఎన్నికల విషయంలో వైరిపక్షాలు రెచ్చగొడుతున్నా లోకేష్‌ మాత్రం మౌనంగా ఉంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వీలైనంత దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఆయన నిర్ణయం సరైనదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే గ్రేటర్‌ పరిధిలో సీమాంధ్రులు ఎక్కువగానే ఉన్నా%లల% వారంతా మొన్నటి ఎన్నికల్లోలాగా టీడీపీకి గంపగుత్తగా ఓట్లేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే జరుగుతున్న స్థానిక ఎన్నికలు కావడంతో తమ ఏరియాలో మౌలికసదుపాయాల అభివృద్ధి కోణంలో ఓటర్లు ఓటేసే అవకాశం ఉంది. పైగా తమకు స్థానికంగా అవసరాలు ఉండడం.. టీఆరెస్‌ ప్రభుత్వం ఉద్యమ సమయంలో మాదిరిగా సెటిలర్లను వ్యతిరేకించకపోవడం.. సెటిటర్ల ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకుంటుండడంతో వారి ఆలోచనలూ మారాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కు వచేసి అభాసుపాలవడం కంటే కామ్‌ గా ఉండడం బెటరని లోకేశ్‌ అనుకుంటున్నారట.

మరోవైపు లోకేష్‌ ఇప్పటి వరకు నేరుగా ఎన్నికల్లో పాల్గొనడం గానీ%లల% తమ పార్టీ అభ్యర్థులను ముందుండి గెలిపించిన సందర్భంగానీ లేదు. పైగా ఆయన నమ్ముకున్న అనుంగు అనుచరుడు అభీష్ఠ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మనిషి కాదు. దీంతో తాను రంగంలోకి దిగి ప్రచారం చేసినా టీడీపీ అభ్యర్థులు ఓడిపోతే ఆ ఎఫెక్టంతా తన ఫ్యూచర్‌ పై పడుతుందన్న భయం ఆయన్ను ఆవరించిందట. తాను రాహుల్‌ గాంధీలా అయిపోతే పార్టీలో కూడా ఎవరూ దేకడం మానేస్తారని భయపడుతున్నారట. దీంతో భవిష్యత్తులో పార్టీకే అధ్యక్షుడు కావాలనుకుంటున్న ఆయన పలాయనం పరమ ధర్మ పథములకెల్లన్‌ అన్న సూక్తి గుర్తు చేసుకుంటూ సైలెంటయిపోతున్నారు. లోకేశ్‌ నిర్ణయం ఆయనకు మంచిదే అయినా టీటీడీపీ నేతలు మాత్రం కనీసం ఈయన కూడా రాకపోతే తమ పరిస్థితి ఏమిటని బెంగ పెట్టుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు