సోనియాగాంధీని నిలదీయండి బాబూ

సోనియాగాంధీని నిలదీయండి బాబూ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎవరి చేతిలో ఉందనే ప్రశ్నకు ఒక్కటే సమాధానం. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ. కాని తెలంగాణ ఉద్యమంలో సోనియాగాంధీని నిలదీసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. తెలంగాణ ప్రాంతంలో మీటింగులు పెట్టి సోనియాగాంధీని విమర్శించిన సందర్భాలున్నాయే తప్ప, సోనియాగాంధీ ఇంటి వద్ద నిరసనలు తెలిపిన సందర్భాలైతే దాదాపు శూన్యం. టి.కాంగ్రెసు నేతలైనా సరే శాంతియుత పద్ధతుల్లో సోనియాగాంధీ యెదుట ఆందోళన చేస్తే బాగుంటుంది. 

కాని విచిత్రంగా టి.కాంగ్రెసు ఎంపిలు పార్లమెంటులో లోపల కొద్దిగా, పార్లమెంటు బయట ఎక్కువగా ఆందోళనలు చేస్తారు. సోనియా ఆగ్రహిస్తే మెత్తబడిపోతారు, బెదిరిపోతారు కూడాను. ఐదుగురు టి.కాంగ్రెసు ఎంపీలు పార్లమెంటు ఆవరణలో దీక్షకు దిగారుగాని వారిని సోనియాగాంధీ అసలు పట్టించుకోనే లేదట. వారికి మద్దతుగా తెలంగాణ ప్రాంత మంత్రులు హైద్రాబాదు నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. వీరేం చేస్తారో చూడాలిక.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English