ఒవైసీకే వార్నింగ్‌ ఇచ్చిన ఐఎస్‌ఐఎస్‌

ఒవైసీకే వార్నింగ్‌ ఇచ్చిన ఐఎస్‌ఐఎస్‌

ప్రపంచానికే ముప్పుగా మారిన ఐఎస్‌ ఉగ్రవాదులు అందరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ లో కరడుగట్టిన ముస్లిం రాజకీయ నేతగా పేరున్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి వారు తాజాగా హెచ్చరికలు జారీచేశారు. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడితే అంతుచూస్తామని బెదిరించారు.

భావజాలం పరంగా అసద్‌ పై రకరకాల విమర్శలున్నా ఆయన ఎన్నడూ ఐఎస్‌ కు అనుకూలంగా వ్యవహరించలేదు. పైగా ఎంఐఎంను జాతీయ పార్టీగా విస్తరిస్తున్న క్రమంలో కొంత లౌకిక భావజాలాన్నీ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐఎస్‌ ఆయన్న బెదిరిస్తోందని తెలుస్తోంది.

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీని హెచ్చరించిన ఐఎస్‌  ట్విట్టర్‌లో తీవ్ర పదజాలంలో పోస్టింగు పెట్టింది. అంతేకాదు భారత్‌లోనూ ఐసిస్‌ను విస్తరింపజేస్తామని పేర్కొంది.  కాగా అసదుద్దీన్‌ మాత్రం ఐఎస్‌ బెదిరింపులకు తానేమీ  భయపడబోనని చెప్పారు. అయితే... ఐఎస్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆయన భద్రత విషయంలో ఎంఐఎం మరింత జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు