బిగ్ బ్రేకింగ్ : లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం

Lockdown

అందరూ ఊహించినట్టే జరిగింది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీతో రెండో లాక్ డౌన్ గడువు ముగియనుండగా… తాజాగా దానిని మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే మరో 14 రోజులు లాక్ డౌన్ పొడిగించినట్లు అర్థమవుతోంది.

కేంద్రం ఎన్ని పాజిటివ్ కౌంట్లు వేసినా దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేంద్రానికి ప్రీతిపాత్రమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, యూపీతో పాటు దక్షిణాదిన ఏపీ లో కూడా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. తాజాగా కేంద్రమే తన తరఫున పొడిగించడంతో ఇక రాష్ట్రాలకు భారం తప్పినట్టయ్యింది. టెస్ట్ కిట్ల పరంగా దేశం పూర్తిగా సన్నద్ధం కాకపోవడం కూడా ఈ లాక్ డౌన్ పొడిగింపునకు కారణమని చెప్పొచ్చు. లాక్ డౌన్ ఎత్తి వేసి… రెడ్ జోన్లు పెట్టడం అనేది జనాల్లో అంతగా వర్కవుట్ కాదని గ్రహించిన కేంద్రం లాక్ డౌన్ కొనసాగించి సడలింపులు పరిమిత ప్రాంతాలకు ఇస్తేనే మంచిదని భావించింది.

అందులో భాగంగానే ఈరోజు ఉదయాన్నే గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లను ప్రకటించిన కేంద్రం తాజాగా లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది అన్ని వ్యవస్థలపై దారుణమైన ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉన్నా… ప్రస్తుత పరిస్థితిలో కేంద్రానికి మరో మార్గం కనిపించడం లేదు.