తెలంగాణ గురించి ఏమంటారు?

తెలంగాణ గురించి ఏమంటారు?

తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తున్నది. దీనికోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయంట. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక ఉత్సవాలు. ప్రతి ఏటా జరుగుతాయివి. వీటిల్లో పార్టీ భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తారు. ఈసారి మహానాడులోనూ కీలక నిర్ణయాలుంటాయని చెప్పారు ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు.

తెలంగాణ అంశం గురించీ మహానాడులో చర్చ జరుగుతుందని యనమల చెప్పగా, ఇదే యనమల ఒకానొక కాలంలో సమైక్యవాదం వినిపించినందువల్ల తెలంగాణ నేతలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదన్న మాట తప్ప తెలంగాణకు అనుకూలం అని తెలుగుదేశం చెప్పలేదు ఇప్పటివరకూ. ఆ పార్టీ కష్టాలు ఆ పార్టీకి ఉన్నాయి ఆ విషయంలో. తెలంగాణకు 'సై' అంటే సీమాంధ్రలో ఆ పార్టీ దెబ్బతింటుంది. విభజనకు వ్యతిరేకమంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మర్చిపోవాల్సి వస్తుంది. ఇది ఇప్పటి సమస్య కాదుగాని మహానాడులో చర్చిస్తామన్నారంటే దానిపై ఏమంటారో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు