ఆంధ్రా దోశకు జపాన్‌ గవర్నర్‌ పడిపోయారు

ఆంధ్రా దోశకు జపాన్‌ గవర్నర్‌ పడిపోయారు

పలు వ్యాపార ఒప్పందాల కోసం ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడకు వచ్చిన జపాన్‌ గవర్నర్‌ బృందానికి ఒక విషయ విపరీతంగా ఆకర్షించింది. జపాన్‌లోని టయోమో గవర్నర్‌ తకకాజు ఇషి తన బృందంతో విజయవాడ వచ్చారు. వారికి విజయవాడలోని గేట్‌ వే హోటల్‌ లో అల్పాహార విందును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పెనం మీద దోశెలు వేశారు. అలా పెనం మీద దోశెలు వేసి.. తీసిన విధానం టయోమో గవర్నర్‌ తకకాజు ఇషిని విపరీతంగా ఆకర్షించింది. ప్రత్యేక ఆసక్తితో.. దోశె ఎలా వేస్తారని ప్రశ్నించటంతోపాటు.. దాని వివరాలు కనుక్కున్న ఆయన.. వాటిని తిన్నారు. ఆంధ్రా వంటకాల్ని రుచి చూసిన జపాన్‌ బృందం ఆసక్తిగా తినటం కనిపించింది. జపాన్‌ బృందానికి ఇడ్లీ.. దోశె.. గారె.. ఉప్మా లాంటి వంటకాల్ని వడ్డించారు. మిగిలిన టిఫెన్ల కంటే దోశె గవర్నర్‌ గారి మనసును భారీగా దోచుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు