పరకాల సీను కాలింది

పరకాల సీను కాలింది

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ జోరు పూర్తిగా తగ్గిపోయింది. ఏపీ ప్రభుత్వంలో ఇంతకాలం హవా సాగించిన ఆయన ఇప్పుడు చప్పున చల్లారిపోయారు. ఆయన వల్ల పార్టీకి కొంచెం కూడా ఉపయోగం లేకపోగా కొత్త సమస్యలు వస్తుండడంతో ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టారని టాక్‌.

ఓటుకు నోటు కేసు తర్వాత ఆయన్ను టీడీపీ అంతగా పట్టించుకోవడం లేదు. ఓటుకు నోటు కేసు సమయంలో ఆయన తన మాటలతో గందరగోళం సృష్టించిన సందర్భాలున్నాయి. తప్పు బాబు చేశారనే అర్దం వచ్చేలా కన్ఫ్యూజన్‌ లో ఇరికించారని బాబు ఆయన మీద కోప్పడ్డారట. ఇక పుష్కరాల సమయంలోనూ కీలక బాధ్యతలు అప్పగించినా ఫెయిలవడంతో బాబుకు ఆయనపై నమ్మకం పూర్తిగా పోయింది.  దీంతో ఆయన్ను రాజకీయ పరమైన నిర్ణయాలకు దూరంగా ఉంచుతున్నారట చంద్రబాబు.ఇంతకు ముందు ప్రభుత్వ కార్యక్రమాలపై ఆయనే ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ వివరించే వారు. కానీ విలేకరులు ఒకటడిగితే ఆయనొకటి చెబుతున్నారు. దీంతో ఆయనతో ప్రెస్‌ మీట్లూ పెట్టించడం లేదు.  

ఇక నిర్మలా సీతారామన్‌ వైపు నుంచి చూసుకున్నా కూడా పరకాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అసవరం కనిపించకపోవడంతో పరకాలను తెర ముందుకు రానివ్వడం లేదు. కేంద్రం సహాయం కోసం, నిధుల సాధన కోసం నిర్మాలాసీతారామన్‌ ను ఏపీ నుంచి రాజ్యసభకు పంపించారు చంద్రబాబు. కానీ, ఆమె ఏపీకి ఏమాత్రం సాయం చేయలేదు. దీంతో మోడీని కాదని ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరని చంద్రబాబుకూ అర్థమైపోయింది. దీంతో ఆమెను మెప్పించడం కోసం పరకాలకు ప్రాధాన్యం ఇచ్చే పద్ధతికీ స్వస్తి పలికారు. దీంతో సొంత బలం లేక, భార్య ఇమేజి వల్ల రావాల్సిన ప్రయారిటీ కూడా దక్కక పరకాల గడ్డి పరకలా మారుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు