ఆ ముగ్గురు చేతిలో రోజా భ‌విష్య‌త్తు

ఆ ముగ్గురు చేతిలో రోజా భ‌విష్య‌త్తు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా చిక్కుల్లో ప‌డ‌నున్నారు. అత్యుత్సాహంతో.. వెనుకా ముందు చూసుకోకుండా అసెంబ్లీలో ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడామె త‌ల‌కు చుట్టుకోనున్నాయా? అంటే అవున‌న్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్య‌లు.. ఒక మ‌హిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి అన్న మాట‌లపై సీరియ‌స్ అయిన స్పీక‌ర్ ఆమెపై ఏడాది కాలం పాటు వేటు వేయ‌టం తెలిసిందే.

రోజా ఏం అన్నారు? ఎలాంటి ప‌ద‌జాలాన్ని వాడారు? అన్న విష‌యాలు సామాజిక మాధ్య‌మాల్లో.. మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌టం.. ఆమె చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి. అదే స‌మ‌యంలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విడుద‌ల చేయ‌టానికి ముందే అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ స‌భ్యులకు చెందిన వీడియో క్లిప్పింగ్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో రావ‌టం వివాదాస్ప‌ద‌మైంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడారు.

ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా సోష‌ల్ మీడియాలో ముందుగా విడుద‌లైన సీడీ ఎక్క‌డ నుంచి వ‌చ్చింది? ఎలా వ‌చ్చింద‌న్న విష‌యంపై విచార‌ణ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో మూడు పార్టీల‌తో కూడిన ముగ్గురు స‌భ్యులున్న క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించిన కోడెల ఈ క‌మిటీ ప‌లు అంశాల‌పై విచార‌ణ చేసి.. నివేదిక ఇస్తుంద‌ని వెల్ల‌డించారు.

రోజాపై విధించిన ఏడాది స‌స్పెన్ష‌న్ ను పొడిగించాలా? వ‌ద్దా? అన్న విష‌యాన్ని కూడా స‌ద‌రు క‌మిటీ నివేదిక ఇస్తుంద‌ని పేర్కొన్న నేప‌థ్యంలో.. రోజాపై వేటు మ‌రికొంత కాలం పొడిగించాల‌న్న ఆలోచ‌న‌లో ఏపీ స్పీక‌ర్ ఆలోచిస్తున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌టం ఖాయం. ఒక‌వేళ అదే జ‌రిగితే.. రోజాకు మ‌రిన్ని ఇబ్బందులనే చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English