పార్టీలు అధికార ప్రతినిథులు

పార్టీలు అధికార ప్రతినిథులు

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిథి 'ఈనాడు' అన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు నేత అంబటి రాంబాబు. ఆంధ్రజ్యోతిని అంబటి వారు ఎందుకు వదిలేశారోగాని, ఆయన విమర్శలో కొత్తదనం లేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్నన్నాళ్ళూ ఆ రెండు పత్రికలంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై ఇలానే విమర్శలు చేశారు.

వైఎస్‌ ఫొటో పెట్టుకున్నారు గనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు నేత అంబటి రాంబాబు ఇలా మాట్లాడడం సహజమే. కాని తెలుగుదేశం అధికార ప్రతినిథి ఈనాడు అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిథి సాక్షి అవుతుంది కదా. సాక్షి అధినేత జగనే కాబట్టి ఇది అందరికీ తెలుసు, కొత్తగా చెప్పనవసరం లేదని అంబటి అన్నా అంటారు. మీడియా, రాజకీయాల తీరు అలా ఉంది. కాని అంబటివారు తమ వెనుక మచ్చపెట్టుకుని ఇతరుల్ని విమర్శించడమే హాస్యాస్పదంగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు