బయ్యారం దెబ్బకి అబ్బా అనాలె

బయ్యారం దెబ్బకి అబ్బా అనాలె

బయ్యారంలోని ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి తరలించకుండా తెలంగాణలోనే స్టీలు ప్లాంటు ఏర్పాటు చేసేలా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధపడుతుండగా, సమాంతరంగా అదే ఉద్యమాన్ని నడిపేందుకు తెలంగాణ జేఏసీ కూడా ఓ నిర్ణయం తీసుకున్నది. ఏ పార్టీ బయ్యారం కోసం పోరాటం చేసినా దానికి సహకరించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ప్రకటించారు.

ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమాన్ని చులకనగా చూస్తున్నారని బయ్యారం ఉద్యమం దెబ్బకు ముఖ్యమంత్రి అబ్బా అనాలె.. అనే దిశగా టిఆర్‌ఎస్‌, తెలంగాణ జెఎఎసి కార్యాచరణలు రూపొందిస్తున్నాయి. భూకంపం సృష్టిస్తారా? తట్టుకుంటామని చెప్పిన కిరణ్‌రెడ్డి బయ్యారం ఉద్యమంపై ఎలా స్పందిస్తారన్నది ప్రశ్న.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు