గుంత లేని రోడ్డు చూపిస్తే.. రూ.లక్ష

గుంత లేని రోడ్డు చూపిస్తే.. రూ.లక్ష

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు నోటికి పని చెబుతున్న సంగతి తెలిసిందే. విమర్శలు.. ఆరోపణలు.. లాంటి వాటికికాస్తంత భిన్నంగా.. వ్యంగ్యంగా.. సూటిగా ఆకర్షించేలా.. రోటీన్‌ కి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి భారీ ఆఫర్‌ ను ప్రకటించారు. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ లో గుంత చూపిస్తే నజరానా అంటూ అప్పటి గ్రేటర్‌ కమిషనర్‌ ప్రకటనలోని డొల్ల తనాన్ని ఎత్తి చూపించటంతో పాటు.. తెలంగాణ అధికారపక్షం వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తూ.. భారీ ఆఫర్‌ ప్రకటించారు.

హైదరాబాద్‌ లోని గుంత లేని రోడ్డు చూపిస్తే.. రూ.లక్ష ఇస్తానని సవాలు విసిరారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవమరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ప్రోటోకాల్‌ ను అస్సలు పట్టించుకోవటం లేదని.. గ్రేటర్‌ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు హోర్డింగ్‌ ల కోసం ప్రయత్నిస్తుంటే.. హోర్డింగ్‌ లు ఇవ్వకుండా ఉండేలా తెలంగాణ అధికారపక్షం బెదిరిస్తోందన్నారు. ఇక.. రోడ్ల విషయానికి వస్తే.. గ్రేటర్‌ పరిధిలోని రోడ్లలో గుంతలులేని రోడ్డు చూపిస్తే.. రూ.లక్ష ఇస్తారంటూ సవాలు విసిరారు. మరి.. కిషన్‌ రెడ్డి సవాలుకు తెలంగాణ అధికారఫక్షం ఎలా స్పందిస్తుందో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు