హంతకురాలే కాదు.. సెక్స్ ఎఫైర్స్ కూడా ఎక్కువే

హంతకురాలే కాదు.. సెక్స్ ఎఫైర్స్ కూడా ఎక్కువే

కన్నకూతురిని పాశవికంగా చంపేసి ఉదంతంలో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి యవ్వారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  ఆమెకు సంబంధించి వివరాల్ని సేకరిస్తున్న సీబీఐ అధికారులకు లభిస్తున్న సమాచారం.. ఆధారాలు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోందట. మొగుళ్లను మార్చే విషయంలోనే కాదు.. అమ్మడికి సెక్స్ ఎఫైర్స్ కూడా చాలానే ట్రాక్ రికార్డు ఉందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

తనకు పెళ్లిళ్లు జరిగి.. పెద్ద కూతురే ఉన్నప్పటికీ.. తన చెల్లెలులగా చెప్పుకుంటూ స్టార్ మాజీ సీఈవోను వలలో వేసుకున్న ఆమెకు.. సెక్స్ స్కాండల్స్ చాలా కామన్ అన్న మాట చెబుతున్నారు. ఆమెకు చాలామందితో శారీరక సంబంధాలు ఉన్నట్లుగా ఆధారాలు బయటకు వస్తున్నాయి.

తాజాగా ఆమెకున్న సెక్స్ ఎఫైర్స్ గురించి ఆమె మాజీ ప్రియుడు.. కోల్ కొతాకు చెందిన వ్యాపారవేత్త అభిజిత్ సేన్ సీబీఐ అధికారుల ముందు వెల్లడించాడు. ఆమెకు శారీరక సంబంధాలున్న వారిలో బ్రిటన్ కు చెందిన వ్యాపారవేత్త కుమారుడు.. ఇద్దరు ఐపీఎస్ అధికారులు.. నేవల్ వార్ రూమ్ లీకేజీ కేసుకు సంబంధించిన వ్యక్తులతోనే ఆమెకు ఎఫైర్స్ ఉన్నట్లు వెల్లడించారు.

అంతేకాదు.. తాను కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలోనూ మాజీ భర్తల నుంచి డబ్బు గుంజుకునే విషయంలో ఎలాంటి కనికరం చూపేది కాదట. వీలైనంత వరకూ దండుకోవటానికి ఎలాంటి మొహమాటానికి గురి కారన్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. మరింత లోతుగా వెళితే.. ఇంద్రాణి ఇష్యూలో మరెన్ని చీకటి కోణాలు బయటకు వస్తాయో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు