తెలంగాణ సర్కారీ సెలవులు ఎన్నో..

తెలంగాణ సర్కారీ సెలవులు ఎన్నో..

మరో పాతిక రోజులు దాటితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసినట్లే. బిజీ.. బిజీగా మారిన జీవితంలో ఏళ్లకు ఏళ్లు వేగంగా మారిపోతున్న పరిస్థితి. కాల గమనంలో మరో ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరం వస్తుందంటే.. చాలానే లెక్కలు ఉంటాయి. మిగిలిన వాటితో పోలిస్తే.. కొత్త సంవత్సరం వస్తుందంటే సెలవులు ఎన్ని వస్తున్నాయన్న ఆసక్తి ఉంటుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 2016 సంవత్సరానికి సంబంధించి సెలవుల్ని ఖారారు చేసింది.

ఏడాది మొత్తంలో 23 సాధారణ సెలవులు అయితే.. 21 ఐచ్ఛిక సెలవుల్ని ప్రకటించింది. వాస్తవానికి సాధారణ సెలవులు 27 ఉండాల్సింది. అయితే.. అందులో నాలుగు సెలవులు (గాంధీ జయంతి.. దుర్గాష్టమి.. దీపావళి.. క్రిసమస్) ఆదివారాలు రావటంతో 23 సెలవులు అయ్యాయి. సాధారణ సెలవుల్లో మూడు అక్టోబరులో వచ్చే సెలవుల్లో మూడు (గాంధీ జయంతి.. దుర్గాష్టమి.. దీపావళి) పండగలు ఆదివారం రావటం గమనార్హం.

ఇక.. ఆప్షనల్ హాలీడేస్ కింద 21 సెలవులు వచ్చాయి. ఇవి కాక మరో రెండు సెలవులు ఆదివారం పూట రావటం గమనార్హం. మొత్తం 365 రోజుల్లో 52 రోజులు వారాంతపు సెలవులు పోతే.. సాధారణ సెలవులు 23.. ఆప్షనల్ హాలీడేస్.. క్యాజువల్.. సిక్ లీవ్స్ ను లెక్క వేస్తే.. సెలవులు తీసుకునే రోజులకు.. పని చేసుకునే రోజులకు మధ్య అంతరం కాస్త తక్కువగా ఉన్నట్లు కనిపించక మానదు.

ఆప్షనల్ హాలీడేస్ లో ముఖ్యమైన రోజులు చూస్తే..

1.  న్యూఇయర్
2.  కనుమ (జనవరి 16)
3.  వరలక్ష్మి వ్రతం(ఆగస్టు 12)
4.  రాఖీ పూర్ణిమ (ఆగస్టు 18)
5.  నరక చతర్ధశి (అక్టోబర్ 29)

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English