సీఎం ఛానళ్లు రెండూ ఆగిపోయాయి

సీఎం ఛానళ్లు రెండూ ఆగిపోయాయి

చెన్నై వానల విశ్వరూపం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. 137 ఏళ్లుగా నాన్‌ స్టాప్‌ గా పబ్లిష్‌ అయిన హిందూ దినపత్రిక భారీ వర్షాల కారణంగా బుధవారం నాడు పబ్లిష్‌ కాకపోవటం తెలిసిందే. ఇలాంటి దెబ్బ ఒక్క ది హిందూకు మాత్రమే కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి జయలలితకు చెందిన మీడియా సంస్థకు తగిలింది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయకు చెందిన పుతియ తలైమురై.. జయ టీవీ కార్యాలయాల్లోకి వాన నీరు భారీగా చేరుకుంది. దీంతో.. ఛానల్‌ కార్యక్రమాల ప్రసారంలో అంతరాయం ఏర్పడింది. ముఖ్యమంత్రి సొంత ఛానళ్లు సైతం ప్రసారం కాకుండా పరిస్థితి ఏర్పడిందంటే.. వర్ష బీభత్సం ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. భారీ వర్షాల కారణంగా పలు వాగులు.. కాల్వలు పొంగిపొర్లాయి. కొన్ని నదుల వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై జూపార్క్‌ నుంచి 40 మొసళ్లు కొట్టుకుపోయాయి. దీంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.

వర్షపు నీటిలో ఈ మొసళ్ల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు.. వర్షపు నీటితో పాములు పెద్ద ఎత్తున  ఇళ్లు.. అపార్ట్‌ మెంట్లలోకి వస్తున్నాయి. దీంతో.. భయపడుతున్న నగర వాసులు కంటి  నిండా కనుకు లేకుండా ఉండిపోయే పరిస్థితి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు