సినిమా వేడుకల్లో ఫుల్‌ జోష్‌పై ఉన్న భారతి

సినిమా వేడుకల్లో ఫుల్‌ జోష్‌పై ఉన్న భారతి

ఏడాది నుంచి బెయిలు ఇవ్వకుండా నా భర్తను జైల్లోనే పెట్టి వేధిస్తున్నారు. మీకు సంసారాలు లేవా.. మీకు కుటుంబాలు లేవా..? నా బిడ్డలకు తండ్రి ప్రేమ అక్కర్లేదా..? తండ్రి లాలన అక్కర్లేదా అంటూ వైఎస్‌ జగన్మోహనరెడ్డి సతీమణి భారతి.. సీబీఐ అధికారులు తనకు తారసపడినప్పుడు తీవ్రస్వరంతో దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. అంతకంటె తరచుగా.. ప్రతి వారం... తమ సాక్షి దినపత్రికలో జగన్‌ జైలులో ఉండడం వలన.. తమ కుటుంబం ఎంతటి కఠోరమైన ఆవేదనా ఉధృతిలో కుమిలి కునారిల్లిపోతున్నదో... తాము ఎంతటి వేదనాంతరంగులమై.. క్షోభిల్లుతున్నామో అక్షరమక్షరంలోనూ సానుభూతి గొలిపే మాటలను రంగరించి.. కాలమ్స్‌కు నిండుగా వండి వారుస్తుంటుంది.
అయితే ఏమిటి ఆమె ఆవేదన? జగన్‌ పాపం.. జైల్లోనే అగచాట్లు పడుతున్నాడన్న వేదనలో బాహ్య ప్రపంచపు జీవితంలో ఆయన భార్యగా ఆమె ఏం వేదన పడుతున్నట్లుగా మనకు కనిపించదు.  కనీసం పాదయాత్ర చేస్తున్న షర్మిల, జిల్లాల యాత్రలు చేస్తున్న విజయమ్మ జగన్‌ బాధ్యతల్ని పంచుకుంటున్నారని అనుకోవచ్చు. అదే క్రమంలో భారతి కూడా సాక్షి కార్యాలయంలో కూర్చుని వ్యాపార సామ్రాజ్య పర్యవేక్షణ నెరపుతున్నారని అనుకోవచ్చు. అంతమాత్రాన వేదనాసంద్రంలో మునుగుతున్నట్లు భావించడం అనవసరం. ఎందుకంటే ఆమె ఎంచక్కా సినిమా ఆడియో విడుదల వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఫుల్‌ జోష్‌ మీద గడుపుతున్నారు.

వైఎస్‌ఆర్‌తో జీవితమంతా సున్నంపెట్టుకుని గడిపిన నాయకుడు పీజేఆర్‌. ఆయన కూతురు ప్రస్తుతం వైకాపాలో ఉన్నారు. ఆమె కుమారుడు హీరోగా ‘స్వామి వివేకానంద’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఆడియో వేడుకకు ముఖ్యఅతిథిగా భారతి హాజరై.. సీడీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం చూసిన వారు మాత్రం.. భర్త జైల్లో ఉన్నందున తమకు అసలేమీ పాలుపోవడం లేదన్నట్లుగా వ్యాసాలు రాసే భారతి .. ఎంచక్కా సినిమా ఫంక్షన్లకు రావడం ఏంటబ్బా అని ముక్కున వేలేసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English