మిస్టర్‌ 'సిద్ధా'.. ది సిఎం

మిస్టర్‌ 'సిద్ధా'.. ది సిఎం

కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య పేరును ప్రకటించింది కాంగ్రెసు పార్టీ. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘనవిజయం సాధించగా, ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం అరడజను మంది వరకూ పోటీ పడ్డారు. కాని సామాజిక వర్గాల సమీకరణాలను లెక్కల్లోకి తీసుకుని వెనుకబడిన తరగతులకు చెందిన సిద్ధరామయ్య వైపే కాంగ్రెసు పార్టీ మొగ్గు చూపింది.

 సిద్ధ రామయ్య కాంగ్రెసు పార్టీలో చేరకముందు జనతా దల్‌ (ఎస్‌)లో కీలకంగా పనిచేశారు. ఆ పార్టీని వీడి కాంగ్రెసులోకి వచ్చాక, కాంగ్రెసు అధిష్టానానికి తగ్గట్టుగా మారిపోవడమే గాక కర్నాటకలో బిజెపి పాలనను ఎండగడుతూ తన ఉనికిని చాటుకోవడం జరిగింది. అదే ఆయన్ను కాంగ్రెసు పార్టీలో ముఖ్య నేతగా మార్చిందని చెపుతారు. కర్నాటక పిసిసి అధ్యక్షుడు ఎన్నికల్లో ఓడిపోవడమూ సిద్ధ రామయ్యకు వరంగా మారిందని చెప్పవచ్చును.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు