ఆ ముస్లిం పెద్దమనిషి ఆడోళ్లను ఎంతమాట అన్నారంటే

ఆ ముస్లిం పెద్దమనిషి ఆడోళ్లను ఎంతమాట అన్నారంటే

ఎవరైనా ఏదైనా వ్యాఖ్యలు చేస్తే.. దానికి నానా యాగీ చేయటం.. దానికి హిందుత్వ అనే ముద్ర వేయటంతో పాటు.. మరీ ఇంత సంకుచితంగా వ్యవహరిస్తారా? అంటూ విమర్శలు సంధించటం మామూలే. అదే సమయంలో.. ముస్లిం వర్గాలకు సంబంధించి ఏస్థాయి వ్యక్తులు మాట్లాడితే.. ఎంత ఆరాచక వ్యాఖ్యలు చేసినా పెద్దగా పట్టించుకోకపోవటమే కాదు.. దానిపై ఎలాంటి చర్చ జరగదు. ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాదు. మరి ఈ వివక్ష ఏమిటో అర్థం కాదు. ఇస్లాం పేరుతో మహిళల గొంతు నొక్కేయటమే కాదు.. వారి పట్ల అవమానకరంగా చేసిన వ్యాఖ్యలు తాజాగా పెను వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి.

ముస్లిం విద్యాధికులు.. ఉన్నత స్థానంలో ఉండి మహిళల పట్ల చులకన భావంతో వ్యాఖ్యలు చేయటమే కాదు.. దానికి మతాన్ని అడ్డుపెట్టుకొని వ్యాఖ్యలు చేయటం పలువురిని కలిచివేస్తోంది. అఖిల భారత సున్నీ జమియ్యాతుల్‌ ఉలేమా అధిపతి కాంతపురం ఎ.పి. అబూబకెర్‌ ముస్లియార్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై లౌకికవాదులు.. లౌకిక మాటను తరచూ ప్రస్తావించే రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ అబూబకెర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తే.. ''మహిళలు  కేవలం పిల్లల్ని కనటానికి మాత్రమే పనికి వస్తారు'' అంటూ అఖిల భారత సున్ని జమియ్యాతుల్‌ ఉలేమా వ్యాఖ్యానించారు. కోజికోడ్‌ లో ముస్లిం విద్యార్తుల సమాఖ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లింగసమానత్వం అనే మాటకు ఇస్లాం వ్యతిరేకమన్నారు.

స్త్రీలకు మనోబలం.. ప్రపంచాన్ని నియంత్రించే శక్తి లేవన్న మాటను మాట్లాడిన ఆయన.. ఈ రెండు అంశాలు పురుషులకు మాత్రమే సొంతమని చెప్పుకొచ్చారు. లింగసమానత్వం అన్నది ఆచరణ సాధ్యం కాని అంశంగా తేల్చేసిన ఆయన.. ఈ అంశం ఇస్లాం.. మానవతావాదానికి పూర్తి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. ''మహిళలు పురుషులతో సమానం కాలేరు'' అని తేల్చేసిన వ్యాఖ్యలపై షబానా ఆజ్మీ.. అరుంధతీరాయ్‌ లాంటి మేధావులతో పాటు.. సల్మాన్‌.. షారూక్‌.. అమీర్‌ ఖాన్‌ లాంటి వాళ్లు నోరు విప్పుతారా? లేక.. మాటలు రాని వారిగా ఉండిపోతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు