అధికారం చేజారి.. మూడోస్థానానికి పడిపోయి

అధికారం చేజారి.. మూడోస్థానానికి పడిపోయి

ఎన్నికల్లో ఓటమి ఓ పరాభవమైతే, మూడో స్థానానికి పడిపోవడం అంతకన్నా పెద్ద పరాభవం. అయినా నిండా మునిగినవాడికి చలేమిటన్నట్లుగా మారిపోయినది కర్నాటకలో కమలం పార్టీది. భారతీయ జనతా పార్టీ కర్నాటక ఎన్నికలలో చావు దెబ్బ తినగా, ఆ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా నిలబెట్టుకోలేకపోయినది.

సీట్ల పరంగా జెడిఎస్‌తో సమానంగా బిజెపికి లెక్క సరిపోయినప్పటికినీ, ఓట్ల పరంగా చూసుకున్నట్లయితే బిజెపికన్నా జెడిఎస్‌ మెరుగ్గా ఉంది. అదే జెడిఎస్‌కి వరంగా మారింది. ప్రధాన ప్రతిపక్షంగా జెడిఎస్‌ని గుర్తిస్తారు. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న బిజెపి ఇకపై ఓ సాదా సీదా ప్రతిపక్షంగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది అసెంబ్లీలో. ఇంతకన్నా ఘోర పరాభవం ఇంకేదన్నా ఉందా? అని బిజెపి నేతలు లబోదిబోమంటున్నార్ట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు