మెజార్టీ రికార్డు బద్ధలు కానుందా?

మెజార్టీ రికార్డు బద్ధలు కానుందా?

వరంగల్‌ ఉప ఎన్నిక సంగతేమో కానీ.. రికార్డులు బద్ధలైపోతున్నాయి. ఇప్పటికే సాధారణ ఎన్నికల్లో సాధించిన రికార్డు మెజార్టీ రికార్డును అవలీలగా క్ట్టొి పారేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాగుతున్నజోరు చూస్తుంటే.. వరంగల్‌ ప్రజలు టీఆర్‌ ఎస్‌ పార్టీకి అపురూప విజయాన్ని కట్టబెట్టనున్నట్లుగా కనిపిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ జరిగిన లోక్‌ సభా స్థానాల ఎన్నికల్లో నమోదైన అత్యధిక మెజార్టీ రికార్డును తాజా వరంగల్‌ ఉప ఎన్నిక బీట్‌ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

మొత్తం 22 రౌండ్ల ఉప ఎన్నికల్లో ప్రస్తుతం 16 రౌండ్లు పూర్తి అయ్యాయి. ఇంకా ఆరు రౌండ్లు మిగిలి ఉన్నాయి.  16 రౌండ్లు పూర్తి అయ్యే నాటికి టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 4.38లక్షల అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక.. ఇప్పటివరకూ నమోదైన అత్యధిక మెజార్టీ సాధించిన వారి రికార్డులు చూస్తే.. వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితం సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటివరకూ దేశంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ (ఎంపీ స్థానానికి) 5,92,502 ఓట్లుగా ఉంది. ఇంకా ఆరు రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ రికార్డును టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి బ్రేక్‌చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక.. ఇప్పటివరకూ అత్యధిక మెజార్టీలు చూస్తే..

1. అనిల్‌ బసు (సీపీఎం)                    5.92 లక్షలు  (2004)

2. పీవీ నరసింహారావు (కాంగ్రెస్‌)        5.80 లక్షలు  (1991)

3. వైఎస్‌ జగన్‌ (వైఎస్సార్‌ కాంగ్రెస్‌)     5.45 లక్షలు  (2011)

4. రాం విలాస్‌ పాశ్వాన్‌ (జనతాదళ్‌)   5.04 లక్షలు  (1989)

5. రాం విలాస్‌ పాశ్వాన్‌ (జనతాదళ్‌)   4.24 లక్షలు  (1977)

6. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి (కాంగ్రెస్‌)        4.22 లక్షలు  (1991)

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు