టీ సర్కారు పై హైకోర్టు అసంతృప్తి

టీ సర్కారు పై హైకోర్టు అసంతృప్తి

తెలంగాణ ప్రభుత్వానికి మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. కేసీఆర్‌ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్థిదారుల ఎంపికకు సంబంధించి జారీ చేసిన జీవోపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్థిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం అనుసరించాలని భావిస్తున్న విధానాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇప్పటికే జారీ చేసిన జీవోను ఉపసంహరించుకొని తాజాగా మరో జీవో జారీ చేస్తే మంచిదన్న సూచన చేసింది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్థిదారుల ఎంపికకు సంబంధించి మంత్రులు.. ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ ఒక ప్రజాహిత వాజ్యం దాఖలైంది. దీని విచారణ సందర్భంగా హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి బోసాలే..న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ రవికుమార్‌ లతో కూడిన ధర్మాసనం తన అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేసింది.ఈ వ్యాజ్యాన్ని కరీంనగర్‌ కు చెందిన దేవదాస్‌ అనే వ్యక్తి వేశారు. దీన్ని విచారించిన కోర్టు.. డబుల్‌ బెడ్రూం లబ్థిదారుల ఎంపిక బాధ్యతను సగం మంత్రులకు.. సగం ఎమ్మెల్యేలకు అప్పగించటం సరికాదన్న వాదనను సమర్థించిన ధర్మాసనం ఈ జీవో విషయంలో తాము సైతం సంతృప్తికరంగా లేమని తేల్చి చెప్పారు. లబ్థిదారుల ఎంపికకు ఒక విధానం ఉండాలే కానీ.. ప్రజాప్రతినిధులకు ఎంపిక బాధ్యతను ఎలా కట్టబెడతారంటూ ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. ప్రభుత్వం అనుసరించనున్న విధానానికి సంబంధించిన పూర్తి వివరాల్ని కౌంటర్‌ రూపంలో కోర్టు ముందు ఉంచుతానని చెప్పటంతో ఈ కేసు విచారణను వాయిదా వేశారు. హైకోర్టు తాజా స్పందన నేపథ్యంలో..  ప్రస్తుతం అమలు చేయాలని భావిస్తున్న డబుల్‌ బెడ్రూం లబ్థిదారుల ఎంపిక మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English