రాధాకృష్ణ సమర్పించు కేసీఆర్‌ వంద అబద్ధాలు

రాధాకృష్ణ సమర్పించు కేసీఆర్‌ వంద అబద్ధాలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ వర్సెన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పోరు కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం అన్న చందంగా రోజురోజుకు తీవ్రతరమవుతోంది. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు స్టార్ట్‌ అయిన వీరిద్దరి వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. రీసెంట్‌ తెలంగాణలో ఆంధ్రజ్యోతి ఛానెల్‌ ప్రసారాలు పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఎక్కడా ఏబీఎన్‌ ప్రసారాలు రావడం లేదు. ఏబీఎన్‌ ఛానెల్‌ ప్రతినిధులు సుప్రీంకోర్టు కాపీతో ఎంఎస్‌వోల చుట్టూ తిరుగుతున్నా వారి గోడు విన్నవారే లేరు.

తెలంగాణలో మీడియా దాదాపుగా కేసీఆర్‌ కనుసన్నల్లో నడుస్తోందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. అక్కడ పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు అనే తేడా లేకుండా ఎవరూ కేసీఆర్‌ వ్యతిరేక వార్తలు రాసే సాహసం చేయడం లేదు. ఈ నేపథ్యంలో.. ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే సర్కారు లోపాలు ఎత్తి చూపుతూ కేసీఆర్‌ సర్కార్‌పై బిగ్‌ ఫైట్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ తన ఛానెల్‌ ప్రసారాలు ఆగినా రాధాకృష్ణ సుప్రీంకోర్టులో కేసు వేసి మరీ గెలిచారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చినా తెలంగాణలో ఏబీఎన్‌ ఛానెల్‌ ప్రసారాలు రాకపోవడంతో ఏబీఎన్‌ రాధాకృష్ణ మరింతగా రెచ్చిపోయి కేసీఆర్‌ అండ్‌ కోపై కథనాలు వండి వారుస్తున్నారు.

నిన్నటి వరకు ఆంధ్రజ్యోతిలో కేసీఆర్‌- సీబీఐ వార్తలు సీరియల్‌ గా ప్రచురించారు. తర్వాత వరంగల్‌ ఎన్నికలకు ముందు అక్కడ కేసీఆర్‌ చేయించిన సర్వేలో ఫలితం అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చిందని మరో కథనం ప్రచురించింది. దీనికి కేసీఆర్‌ కౌంటర్‌ కూడా ఇచ్చారు. తర్వాత కేసీఆర్‌ కుమార్తె కవితను టార్గెట్‌గా చేసుకున్నారు. మళ్లీ రాధాకృష్ణ కేసీఆర్‌కు యాంటీగా మరో సంచలన కథనం ఇస్తున్నారు. కేసీఆర్‌ వంద అబద్ధాల పేరుతో యూట్యూబ్‌ లో విజువల్స్‌ను అప్‌ చేయించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్న డైలాగ్‌ తో ఈ వంద అబద్ధాల పరంపర ప్రారంభమవుతుంది. ఈ వంద అబద్ధాల వీడియోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు