నారా బ్రాహ్మణి... ప్రజాసేవ అరంగేట్రం

నారా బ్రాహ్మణి... ప్రజాసేవ అరంగేట్రం

పార్టీ కార్యకర్తలకు, పేదలకు సేవ చేసేందుకు ఉద్దేశించిన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సతీమణి నారా బ్రాహ్మణి తెలిపారు. కృష్ణా, వరంగల్‌ జిల్లాల్లో ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌లను విస్తరిస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలను బ్రాహ్మణి మీడియాకు వెల్లడించారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్న కార్యక్రమాల గురించి బ్రాహ్మణి వివరిస్తూ...పేద విద్యార్థులకు గ్రూప్‌1, గ్రూప్‌2 ఉద్యోగాల్లో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. పలు ఉద్యోగాలకు ఎంపిక అయ్యేందుకు 800 మందికి తగిన శిక్షణ ఇస్తామని తెలిపారు. 2005లో ప్రారంభించిన ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్స్‌ వల్ల వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పించామని తెలిపారు. ఇదే క్రమంలో స్కిల్‌ ట్రెయినింగ్‌ ద్వారా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించే సత్తాను నిరుద్యోగులు పొందగలరని వివరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల్లోనూ నైపుణ్యాల వృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని బ్రాహ్మణి తెలిపారు. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు, పేద ప్రజానికానికి, పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడేవిధంగా ట్రస్ట్‌ను మరింత బలోపేతం చేయనున్నట్లు బ్రాహ్మణి వివరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు