పీట‌ర్ ముఖ‌ర్జీయా అరెస్టు

పీట‌ర్ ముఖ‌ర్జీయా అరెస్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా భర్త పీటర్ ముఖర్జియాను సీబీఐ కొద్ది సేపటి కిందట అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇంద్రాణి ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే.

ముంబై సరిహద్దులోని రాయ్ గఢ్ అడవిలో లభ్యమైన మృతదేహం షీనాబోరాదే అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం నిర్ధారించిన సంగ‌తి తెలిసిందే. ఎయిమ్స్ ఫోరెన్సిక్ నివేదికను సీబీఐ అధికారులకు సమర్పించ‌గా.... ఈ నివేదిక ఆధారంగా షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితులైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను ఇప్ప‌టికే అరెస్టు చేశారు.

ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా,  కారు డ్రైవర్ శ్యామ్ వర్ సింగ్ లపై ఛార్జీ షీట్ నమోదు చేశారు. త‌దుప‌రి ద‌ర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు పీట‌ర్ ముఖ‌ర్జీయాను తాజాగా అరెస్టు చేశారు. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసులో పై ఛార్జీ షీట్ దాఖలు చేస్తామని ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను ఇందులో పేర్కొంటామని సీబీఐకి చెందిన ఓ అధికారి వివరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు