15 గెలవగలరా?

15 గెలవగలరా?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చి, రోడ్‌ మ్యాప్‌ ప్రకటిస్తే తెలంగాణ ప్రాంతంలో 15 ఎంపీ సీట్లను గెలిపించుకుంటామని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు ఎంపీలు చెప్పారంట. రాహుల్‌ గాంధీతో తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు భేటీ అయి తెలంగాణ వాదం గట్టిగా వినిపించినట్లు తెలిసింది.

రాహుల్‌గాంధీతో తెలంగాణ ఆవశ్యకతను చర్చించామన్నారు ఆయన్ను కలిసిన పార్లమెంటు సభ్యులు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ బలంగా ఉన్నదనే అంశాన్నీ రాహుల్‌ దృష్టికి వారు తీసుకు వెళ్ళారు. కాని కొన్ని నెలల నుంచి తెలంగాణ ప్రాంతంలో పార్టీ పటిష్టత కోసం నేతలు ఎవరూ ప్రయత్నించడంలేదని రాహుల్‌గాంధీ వారితో అన్నార్ట. 15 గెలవగలమని ఏ ధీమాతో చెప్పగలుగుతున్నారని ప్రశ్నించార్ట రాహుల్‌గాంధీ. దీనికి వారేం సమాధానమిచ్చారో ఎవరూ చెప్పడంలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు