ఎర్రబెల్లి వియ్యంకుడిపై ఏసీబీ దాడి

ఎర్రబెల్లి వియ్యంకుడిపై ఏసీబీ దాడి

వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలూ నిమగ్నమయ్యారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి తీవ్రంగా ఉంది. రైతుల ఆత్మహత్యలు, ఎన్నికల హామీలే లక్ష్యంగా ప్రభుత్వంపై అస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతిపక్షాలకు చెందిన కుటుంబ సభ్యులపై దాడులు జరుగుతుండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ శాసనసభలో టీడీపీ  పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు వియ్యంకుడిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదమైంది.

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌ పల్లి అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ సంజీవరావుపై అవినీతి నిరోదక శాఖ దాడి చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నట్లు అభియోగాలు రావడంతో ఆయన పై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతవరకు సుమారు రెండు కోట్ల విలువైన ఆస్తుల వివరాలు అధికారులు సేకరించారు. ఆళ్వాల్‌లోని సంజీవరావు నివాసం, కార్యాయలం తదితరచోట్ల ఏసీబీ దాడులు చేసింది. అయితే ఈ విషయంలో రాజకీయ కోణం కూడా ఉందనే చర్చ జోరుగా ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ శాసనసభలో టీడీపీ పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు కు సంజీవరావు వియ్యంకుడు. దీంతో సహజంగానే ఈ విషయానికి ప్రచారం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా టీడీపీని దెబ్బతీసేందుకే ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.  వరంగల్‌ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలోని పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌ ఎర్రబెల్లి దయాకరరావుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్‌ ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో  ఇటువంటి చర్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనన్న ఆందోళన తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు