గెలవలేదు కానీ సీఎం కుర్చీ మీద కర్చిఫ్‌

గెలవలేదు కానీ  సీఎం కుర్చీ మీద కర్చిఫ్‌

బీహార్‌ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లు రానున్నాయి. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయం తాజా ఫలితాల సరళి చెప్పేస్తుంది. ఇప్పటి వరకూ వెలువడిన అధిక్యం చూస్తే.. ఎన్డీయేకు అనుకూలంగా బీహార్‌ ఫలితాలు ఉన్నాయి.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి చెందిన హెచ్‌ఏఎం నేత జితిన్‌ రాం మాంరీ­ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఎన్డీయే పక్షానికి విజయం మీద ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఎన్డీయే కూటమి కానీ గెలిస్తే.. ముఖ్యమంత్రి ఛాన్స్‌ తనకు దక్కేలా ఆయన మాటలు ఉండటం గమనారం. బీజేపీ కానీ కోరితే తాను ముఖ్యమంత్రిని అవుతానని మాంరీ­ వ్యాఖ్యానిస్తున్నారు.

ఆయన బరిలో ఉన్న చోట అధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో మాంరీ­ వ్యవహారం చూస్తే.. ముఖ్యమంత్రి సీటు మీద కర్చీఫ్‌ వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎవరు మాత్రం సీఎం అయ్యే అవకాశాన్ని వదులుకుంటారు. అందులోకి ఒకసారి సీఎం పదవి ఎలా ఉంటుందో రుచి చూసిన మాంరీ­ లాంటి వారు వచ్చిన అవకాశాన్ని వదిలేస్తారా ఏంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు