కిరణ్‌రెడ్డిపై శంకరన్న సెటైర్‌

కిరణ్‌రెడ్డిపై శంకరన్న సెటైర్‌

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంటే మాజీ మంత్రి శంకరరావుగారికి అమితమైన అభిమానం. ఆ అభిమానంతోనే ఎక్కువగా కిరణ్‌రెడ్డి జపం చేస్తుంటారు శంకరన్న. కర్నాటక ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ కూడా కిరణ్‌రెడ్డి పేరు ప్రస్తావించి ఆయనపై సెటైర్‌ వేసేశారంటే శంకరన్న సెటైరికల్‌ టాలెంట్‌ ఏమిటో అర్థమవుతున్నది.

కర్నాటకలో నాలుగు నియోజకవర్గాలలో కిరణ్‌రెడ్డి ప్రచారం చేయడం జరిగిందనీ, వాటిల్లో ఒక్కటి మాత్రమే కాంగ్రెసు పార్టీ గెలిచిందన్నారు శంకరన్న. అక్కడి ప్రజలకు వాస్తవాలు తెలియడం వల్లనే అలా జరిగి ఉంటుందని శంకరన్న అనడం కాంగ్రెసు పార్టీలో కిరణ్‌ వర్గానికి ఆగ్రహం తెప్పిస్తున్నది.

ఏదో ఆశ కొద్దీ ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రచారంలో పాల్గొంటుంటారుగాని వారి ఛరిష్మాతో అక్కడ గెలిచేస్తామని ఎవరూ అనుకోరు. కిరణ్‌రెడ్డి ప్రచారం కూడా అంతే. కలిసొస్తే బోనస్‌ అని భావించే కిరణ్‌రెడ్డిని ప్రచారానికి తీసుకువెళ్ళింది కాంగ్రెసు పార్టీ కర్నాటకకి. దాన్ని శంకరన్న సెటైరికల్‌గా మాట్లాడి కిరణ్‌రెడ్డిని ఇరుకున పడేసే ప్రయత్నమైతే చేయడం జరిగిపోయింది.