ఢిల్లీ దద్దరిల్లినదా?

ఢిల్లీ దద్దరిల్లినదా?

తెలంగాణ నినాదంతో ఢిల్లీ దద్దరిల్లేలా చేస్తామని చెప్పిన తెలంగాణ పొలిటికల్‌ జెఎసి ఢిల్లీలో దీక్ష చేపట్టగా, భారతీయ జనతా పార్టీతోపాటుగా ఎన్‌సిపి ఈ దీక్షకు మద్దతు పలికింది. బిజెపి అధికార ప్రతినిథి ఈ దీక్షకు హాజరై, తాము అధికారంలోకి వస్తే గనుక 100 రోజుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందరూ కాంగ్రెసు పార్టీని నిలదీశారు. ఎన్‌సిపి పార్టీ, తెలంగాణ పొలిటికల్‌ జెఎసిలో చేరుతామని చెప్పింది. 

ఢిల్లీ వేదికగా ఇలాంటి ఉద్యమాలు జరిగితే, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమాలు చాలా తక్కువగా జరిగాయి. అది ఉద్యమ లోపం అని చెప్పవచ్చును. ఇకపై ఇలాంటి కార్యక్రమాలు ఉధృతంగా సాగితే ఫలితం సానుకూలంగా కనిపించవచ్చును. ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది. తెలంగాణ ఉద్యమానికి ధీటుగా సమైక్యాంధ్రప్రదేశ్‌ నినాదంతో ఇంకో టెంట్‌ నిలబడితేనో!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English