బాణాల్ని దాచుకున్ని బొత్స బ్లాక్‌మెయిల్‌ చేస్తారా?

బాణాల్ని దాచుకున్ని బొత్స బ్లాక్‌మెయిల్‌ చేస్తారా?

వైఎస్‌ జగన్మోహనరెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవం తగ్గుముఖం పడుతున్నట్లుగా.. పంచాయతీ ఎన్నికలు ఒక స్పష్టత ఇస్తున్నాయి. అదే సమయంలో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తన స్వరం పెంచారు. ఏకంగా వైఎస్‌ మద్యప్రియత్వం గురించి గుట్టుమట్టులు విప్పిచెప్పారు. దానికి జవాబుగా షర్మిల తిరిగి తిట్ల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇటువైపు బొత్ససత్యనారాయణకు మద్దతుగా వైఎస్‌ అంటేనే ఇంతెత్తున ఎగిరి పడుతూ ఉండే.. వృద్ధ నాయకుడు, రాజ్యసభ ఎంపీ వి హనుమంతరావు రంగంలోకి వచ్చారు. బొత్స వ్యాఖ్యలను ఆయన ఘనంగా సమర్థించారు. బొత్స ప్రస్తుతం ఒక్క బాణం మాత్రమే వదిలారని, ఇంకా బొత్స వద్ద అనేక బాణాలు ఉన్నాయని వీహెచ్‌ అంటున్నారు.

అయితే ఇప్పుడు సామాన్య జనానికి ఒక దర్మసందేహం రేకెత్తుతోంది. చాలా బాణాలను కలిగి ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గానీ, కాంగ్రెసు పార్టీ గానీ... ఆ బాణాలను జగన్‌ మీదికి సంధించకుండా ఎందుకు వేచిచూస్తున్నట్లు? ఒకవేళ వైఎస్‌ రాజశేఖర రెడ్డి లేదా జగన్‌ తప్పులే చేసి ఉంటే గనుక, ఆ తప్పులను చాటిచెప్పే బాణాలు బొత్స వద్దగానీ, కాంగ్రెసులో మరెవ్వరి వద్దగానీ ఉన్నట్లయితే గనుక.. వాటిని వదలకుండా వారెందుకు చూస్తూ కూర్చున్నారో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. బాణాలను దాచిపెట్టుకుంటే.. ఆయనేదో ఉదారంగా ఉన్నారని ఎవ్వరూ అనుకోరు. తన వద్ద ఉన్న బాణాలను చూపి.. జగన్‌ను బ్లాక్‌మెయిల్‌ చేయడానికి బొత్స ప్రయత్నిస్తున్నారని మాత్రమే అనుకుంటారు. ప్రజలకు రేకెత్తుతున్న మరో సందేహం ఏంటంటే.. జగన్‌తో కుమ్మక్కు కావడానికి.. తిరిగి లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోవడానికి చివరిక్షణాల వరకు ఏదో ఒక అవకాశం వస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెసు పార్టీ ఉన్నట్లుంది. అందుకే జగన్‌కు సంబంధించి.. తమ వద్ద ఉన్న ఇతర బాణాలను దాచుకుంటూ ఉంది. అలాంటి లోపాయికారీ కుమ్మక్కు కు అవకాశం లేదని తేలిపోయిన రోజున మాత్రమే.. కాంగ్రెస్‌ ఈ బాణాల్ని బయటకు తీస్తుందేమోనని అనిపిస్తోంది.

ఇది మళ్లీ బొత్స బ్లాక్‌మెయిల్‌ వ్యవహారమే లెక్క! ఇప్పటికే  నీ భర్త ఏం తప్పు చేసి నా వద్దకొచ్చాడో తెలియదా? అని చిన్న బ్లాక్‌మెయిల్‌ హింట్‌ ను షర్మిల మీదికి వదిలి బ్రేకులేసే ప్రయత్నం చేశారు. ఆయనకు నిజంగా నిజాయితీ ఉంటే గనుక.. ఆ తప్పు గురించి ప్రజలకు ఎందుకు చెప్పరు? ఈ ఒక్క విషయం ఆలోచిస్తే చాలు... వాళ్ల వక్రబుద్ధులు బయటపడిపోతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English