ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మెడపై వీణావాణి కత్తి

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మెడపై వీణావాణి కత్తి

ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై విచారణ జరపాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ కు చెందిన అవిభక్త కవలలు వీణ, వాణిలకు శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు నిమిత్తం దాతల నుంచి విరాళాలుగా సేకరించిన మొత్తానికి ఆయన వారికి ఇవ్వకపోవడంపై కోర్టులో కేసు పడిన సంగతి తెలిసిందే. జనార్దన గౌడ్ అనే న్యాయవాది ఈ కేసు వేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రాధాకృష్ణపై విచారణ జరపాలని... ఈ నెల 16లోగా నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. దీంతోపాటు ఐపీసీఎ సెక్షన్లు 406, 420, 120(బి) కింద కేసులు నమోదు చేయాలనీ సూచించింది.

కాగా వీణావాణిల కోసం సేకరించిన సొమ్ముపై ఇటీవల మరో పత్రికలో కథనం ప్రచురితమైంది. తెలంగాణలో ఏబీఎన్ ఛానల్ ను ప్రసారం చేయకుండా నిరోధించిన నేపథ్యంలో టీఆరెస్ ప్రభుత్వం, ఆంధ్రజ్యోతి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల వీణావాణిల సొమ్ముపై తెలంగాణ ప్రభుత్వ అనుకూల మీడియాలో కథనాలు రాగా అందుకు ఆంధ్రజ్యోతిలో వివరణ ఇస్తూ కథనాలు ప్రచురితమయ్యాయి.

పత్రికల మధ్య యుద్ధాల కారణంగానైనా వీణావాణిల కోసం సేకరించిన సొమ్ము వారికి చేరితే సంతోషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు