ఏపీలో ఉన్నా తెలంగాణపైనే మోజు

ఏపీలో ఉన్నా తెలంగాణపైనే మోజు

ఏపీలో ఇప్పుడు తెలంగాణకు ఆర్టీసీ బస్సులకు డిమాండు పెరిగిపోయింది. టీఎస్ ఆర్టీసీ అని కనిపిస్తే చాలు ఆ బస్సు కిక్కిరిసిపోతోంది. ఆ బస్సుల్లో ఏపీఎస్ ఆర్టీసీ కంటే టిక్కెటు ధరలు తక్కువగా ఉండడమే అందుకు కారణం. దీంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరిగే మార్గాల్లో ప్రజలు ఏపీ బస్సులకంటే వీటికే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల ఏపీ బస్సుల సిబ్బంది తెలంగాణ బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి.

రీసెంటుగా కర్నూలులో ఇలాంటి సంఘటనే జరిగింది. పొరుగు జిల్లా మహబూబ్ నగర్ నుంచి వచ్చిన టీఎస్ ఆర్టీసీ బస్సు కర్నూలు బస్టాండులో ప్లాట్ ఫారంపైకి రాబోగా దానికి కర్నూలు డిపో కండక్లర్లు దానిని అడ్డుకున్నారు. తమ బస్సులు వెళ్లాకే ఆ బస్సు కదలాలని పట్టుపట్టారు. అయితే... మహబూబ్ నగర్ బస్సు సిబ్బంది మాత్రం... తమ బస్సు టైం కావడంతో వచ్చామని.. అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నించారు. కర్నూలే కాదు విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల్లోనూ తెలంగాణ నుంచి వస్తున్న బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడుతుండడంతో ఏపీ బస్సుల సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.  ఏపీ సర్కారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడమే దీనికి కారణం.

ఏపీ ప్రభుత్వం కొద్ది రోజుల కిందట బస్సు ఛార్జీలు పెంచింది.. తెలంగాణలో మాత్రం పాత ఛార్జీలే ఉన్నాయి. దీంతో ఒకే మార్గంలో ప్రయాణించే బస్సుల్లోనే వేర్వేరు ఛార్జీలు ఉంటున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ బస్సయితే ఎక్కువ ఛార్జీ, టీఎస్ ఆర్టీసీ బస్సయితే తక్కువ ఛార్జీ ఉంటోంది. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సులకే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. బస్సుల రిజర్వేషన్లు కూడా తెలంగాణ బస్సులకే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కొద్దికాలంటో టీఎస్ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు మాత్రం సగం కూడా నిండడం లేదు. దీంతో ఆంధ్రలో టిక్కెట్ ఛార్జీలు పెంచితే తెలంగాణకు ఆదాయం పెరిగినట్లయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు