స్వాతి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది

స్వాతి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది

కళ్యాణ్ రామ్ ఒక మాస్ హీరో. అతడి గత సినిమా ‘పటాస్’ పెద్ద బ్లాక్ బస్టర్. అయినప్పటికీ నందమూరి హీరో కొత్త సినిమా ‘షేర్’ 700 థియేటర్లలో రిలీజైంది. కానీ తర్వాతి వారం రాబోయే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ‘త్రిపుర’ వెయ్యికి పైగా థియేటర్లలో విడుదల కాబోతుండటం విశేషం. ఓవర్సీస్‌ లో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను దాదాపు 800 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో విడుదల కావడం మామూలు విషయం కాదు. చిన్న సినిమాల్లో ఇదో రికార్డు అనుకోవాలి.

‘త్రిపుర’ దర్శకుడు రాజ్ కిరణ్ తొలి సినిమా ‘గీతాంజలి’ హిట్టవడం.. ‘త్రిపుర’ మీద మంచి అంచనాలుండటమే దీనికి కారణం. కోన వెంకట్ ఫ్యాక్టర్ కూడా ప్లస్ అవుతోంది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న కంచె, రాజు గారి గది సినిమాల జోరు ఈ శుక్రవారానికి కొంత తగ్గే అవకాశం ఉంది. అప్పటికి రుద్రమదేవి, బ్రూస్ లీ లాంటి సినిమాలు దాదాపుగా థియేటర్ల నుంచి ఖాళీ అయిపోతాయి. కొలంబస్ అడ్రస్ ఇప్పటికే గల్లంతయింది. తర్వాతి వారం అఖిల్ సినిమా కోసం భారీగా థియేటర్లు బ్లాక్ చేసి పెడుతున్నారు. ఆలోపు ఖాళీ పడే థియేటర్లన్నింటిలో త్రిపురను లాగించేయబోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు