ఎడమొహం పెడమొహమే

ఎడమొహం పెడమొహమే

విశాఖపట్నం నుంచి 2014 ఎన్నికలలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డికీ, కేంద్ర మంత్రి, సిట్టింగ్‌ ఎంపీ పురంధరీశ్వరికీ మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నది. ఈ పోరుకు తెరలేపింది సుబ్బిరామిరెడ్డే. విశాఖ తనదంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు పురంధరీశ్వరికి విసుగు తెప్పిస్తున్నాయి.

 2014 ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తారో అధిష్టానం నిర్ణయిస్తుందని దానిపై ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేయడం తగదని ఆమె కొంచెం నెమ్మదిగానే చెపుతుండగా, తిక్కవరపు మాత్రం పురంధరీశ్వరిని రెచ్చగొట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ గందరగోళం ఇలా ఉండగా విశాఖపట్నంలో ఓ గస్తీ నౌక ప్రారంభోత్సవం సందర్భంగా ఇద్దరూ ఒకే వేదికపై కూర్చున్నారుగానీ ఒకరి మొహం ఒకరు చూసుకోనే లేదు.

అధికార పార్టీకి చెందినవారే ఇలా ఉండడం ఆ పార్టీ వారికి నచ్చనే లేదు. కొంతసేపు ఉండి తిక్కవరపు అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఈ ఎడమొహం పెడమొహం విశాఖపట్నంలో కాంగ్రెసు పార్టీని దెబ్బ కొట్టే ప్రమాదమూ ఉందనడం నిస్సందేహం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు