లవ్వాడేద్దామా? ఆర్‌ యూ రెడీ?

లవ్వాడేద్దామా? ఆర్‌ యూ రెడీ?

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌' అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు లవ్‌ ఎట్‌ ఎనీ సైట్‌ అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రేమ దొరకడం అన్న మాటే చాలా కష్టమయిపోయింది. ఇదివరకటి రోజుల్లో లవర్స్‌ ప్రేమ కోసం జన్మ జన్మలు ఎదురు చూస్తాం అనేవారు. లైలా మజ్ను, సలీం అనార్కలీల ప్రేమకథలు అందుకే చరిత్రలయ్యాయి. కానీ ఇప్పుడు... పార్ట్‌ టైమ్‌ ప్రేమలు పార్కుల్ని వెతుక్కుంటున్నాయి. పబ్లిక్‌ ప్లేసెస్‌లో న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.

అసలైన ప్రేమా? అదెక్కడ

ప్రేమ అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌. ప్రేమ అంటే ఆకర్షణ. కేవలం కొంత కాలం మాత్రమే తమ తమ ఆనందం కోసం లవర్‌ జేబు ఖాళీ చేసే బ్లైండ్‌గేమ్‌ ప్రేమంటే. నిజమైన ప్రేమ ఏమీ కోరుకోదు. కానీ నేటి ప్రేమలు మాత్రం అవసరాన్ని ఆశించి, ఆ అవసరం తీరేంత వరకూ మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. నేటి ప్రేమికులు తమలో ఎవరిది నిజమైన ప్రేమనో తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అంతా బిజీ లైఫ్‌

పెళ్లయిన తర్వాత భాగస్వామిని ప్రేమించే ప్రేమలో ఆరోగ్యం, ఆనందం ఉంటుంది. కానీ నేటి బిజీ లైఫ్‌లో అటువంటి ఆరోగ్యకరమైన ప్రేమను కూడా సంతృప్తిగా పొందే మార్గాలు కనబడడం లేదు. టైమంతా ఉద్యోగాలు ఇతరత్రా పనుల్లో బిజీ అయిపోవడం, తరువాత ఫేస్‌బుక్స్‌, ఇంటర్‌నెట్స్‌లో ఛాటింగ్స్‌ చేస్తూ మిగిలిన టైం వేస్ట్‌ చేసుకోవడంతో భార్యాభర్తల ప్రేమకు అంతరాయం కలుగుతుంది.

జన్మ జన్మల ప్రేమ సంగతి ఏమో గానీ, ఈ జన్మలోనే నిజమైన ప్రేమను తృప్తిగా ఆస్వాదించలేకపోవడం మన దురదృష్టం అనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు