ప్రధాని నరేంద్రమోడీకి షాకిచ్చిన బుడతడు

ప్రధాని నరేంద్రమోడీకి షాకిచ్చిన బుడతడు

ఎనిమిదేళ్ళ బాలుడు ప్రధాని నరేంద్రమోడీకి షాకిచ్చాడంటే నమ్మగలమా? నమ్మలేని నిజం ఇది. స్కూల్‌ నుంచి ఇంటికి వెళుతూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఆ బుడతడికి చాలా కోపమొచ్చి, ప్రధానమంత్రికి లేఖ రాశాడు ట్రాఫిక్‌ సమస్య మీద. ప్రధానికి లేఖ రాయాలంటే ఎంతో తెగువ ఉండాలి. ఆ తెగువ ఉండబట్టే ఆ బుడతడు 'వన్‌ అండ్‌ ఓన్లీ' అయ్యాడు.

ట్రాఫిక్‌ నాన్సెన్స్‌

బెంగళూరుకి చెందిన ఎనిమిదేళ్ళ అభినవ్‌, మూడు కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు తనకు 45 నిమిషాలు పట్టడం పట్ల ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆలోచించాడు, పరిష్కారం ప్రధాని వద్ద దొరుకుతుందని భావించి ప్రధానికే లేఖాస్త్రం సంధించాడు. బుడతడి లేఖని అందుకున్న ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు షాక్‌ అయ్యారట. ప్రధానికి సమాచారం చేరవేశారు అధికారులు.

స్పందించిన ప్రధాని

ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రైల్వే శాఖకు సమాచారం పంపించారు. ట్రాఫిక్‌కి కారణం రైల్వే శాఖ నిర్మిస్తున్న బ్రిడ్జ్‌ అని అభినవ్‌ పేర్కొనడంతో, దాన్ని యధాతథంగా రైల్వే శాఖకు తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. కుర్రాడి సాహసానికి హేట్సాఫ్‌ చెబుతుంది దేశమంతా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English