మైండ్‌ బ్లాక్‌, పర్స్‌ ఖాళీ: ఖరీదైన హోటల్స్‌

మైండ్‌ బ్లాక్‌, పర్స్‌ ఖాళీ: ఖరీదైన హోటల్స్‌

చరిత్రలోకి తొంగి చూస్తే మహరాజుల కాలంలో విలాసవంతమైన కోటలుండేవి. వారి దర్పం ముందు ఏదీ ఆనదు. అంతటి దర్పం ప్రదర్శించేవారు మహరాజులు. ఆనాటి దర్పాన్ని తలపిస్తూ ఇప్పుడు సకల సౌకర్యాలతో స్టార్‌ హోటల్స్‌ వెలుస్తున్నాయి. స్టార్స్‌ సంఖ్య పెరిగే కొద్దీ ఆయా హోటళ్ళలో దర్పం పెరిగిపోతుంది. విదేశాలతో పోటీపడేలా మన దేశంలో ఉన్న అతి ఖరీదైన హోటళ్ళ వివరాలు చూద్దాం.

1. రాంబాగ్‌ ప్యాలెస్‌జైపూర్‌లో ఉంది ఈ హోటల్‌. గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ఖరీదెంతో తెలుసా? ఒక్క రోజుకి కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే. ఇది జైపూర్‌ మహారాజా అధికారిక నివాసమిది.

2. తాజ్‌ లేక్‌ ప్యాలెస్‌ఉదయ్‌పూర్‌లో ఉన్న తాజ్‌ లేక్‌ ప్యాలెస్‌లో గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో ఒక్కరోజు ఉండాలంటే 6 లక్షల చేతి చమురు వదిలించుకోవాలి. మెవార్‌ డైనాస్టీకి చెందినది ఈ ప్యాలెస్‌.

3. లీలా ప్యాలెస్‌ కెంపిన్‌స్కిఢిల్లీలో ఉన్న ఈ హోటల్‌లో మహారాజా సూట్‌ ఖరీదు 4 లక్షల 50 వేల రూపాయలు మాత్రమే.

4. ది ఒబెరాయ్‌గుర్గావ్‌లోని ఒబెరాయ్‌లో గల ఈ హోటల్‌ సింగపూర్‌లో జరిగిన 2012 వరల్డ్‌ ఆర్కిటెక్చర్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ హోటల్‌ డిజైన్‌గా గుర్తింపు పొందింది. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ఖరీదు 3 లక్షలు.

5. ది ఒబెరాయ్‌ముంబైలోని ఈ హోటల్‌లోనూ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ 3 లక్షలకు దొరుకుతుంది. 26/11 తీవ్రవాద దాడులు ఇక్కడే జరిగాయి.

6. ది ఒబెరాయ్‌ ఉదయ్‌ విలాస్‌ఉదయ్‌పూర్‌లో ఉన్న ఈ హోటల్‌లో కోహినూర్‌ సూట్‌ ధర 5 లక్షల రూపాయలు. ప్రపంచంలోనే నాలుగో బెస్ట్‌ హోటల్‌గా గుర్తింపు పొందింది ఉదయ్‌ విలాస్‌.

7. ది ఒబెరాయ్‌ అమర్‌విలాస్‌ఆగ్రాలోని ఈ హోటల్‌లో కోహినూర్‌ సూట్‌ 2 లక్షల 50 వేలకు దొరుకుతుంది. తాజ్‌మహల్‌కి కేవలం 600 మీటర్ల దూరంలో ఉంది ఈ హోటల్‌.

8. తాజ్‌ ల్యాండ్స్‌ ఎండ్‌ముంబైలో ఉన్న ఈ హోట్‌లో ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ఖరీదు 2 లక్షల 50 వేలు. కరణ్‌జోహార్‌ 40వ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఘనంగా జరిగాయి.

9. ఒబెరాయ్‌ రాజ్‌ విలాస్‌జైపూర్‌లో ఉన్న ఈ హోటల్‌లో కోహినూర్‌ విల్లా 2 లక్షల 30 వేలకు దొరుకుతుంది. 32 ఎకరాల్లో నిర్మితమైందిది.

10. తాజ్‌ ఫలక్‌నుమామన హైద్రాబాద్‌లో ఉన్న తాజ్‌ ఫలక్‌నుమాలో గ్రాండ్‌ రాయల్‌ సూట్‌ లక్షా 95 వేల ఖరీదులో ఉంది. నిజాం అధికారిక నివాసం ఇది ఒకప్పుడు.

11. తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌ అండ్‌ టవర్‌ముంబైలోని తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌లో గ్రాండ్‌ లగ్జరీ సూట్‌ ఖరీదు ఒక లక్షా డెబ్భయ్‌ వేలు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ హోటల్‌ 600 పడకల ఆసుపత్రిగా మారి సేవలందించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English