'ఆ విషయంలో' తొందర అవసరమే

'ఆ విషయంలో' తొందర అవసరమే

సినిమా టిక్కెట్ల కోసం తొందరపడ్తాం. ఇంకేదో ఫంక్షన్‌ కోసం ఆత్రం చూపిస్తాం. కానీ, ఆరోగ్యానికి ముఖ్యమైన ఆహారం తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తుంటాం. కొందరు పని ఒత్తిడితోనో, రకరకాల కారణాలతోనో భోంచేసే టైంను నిర్లక్ష్యం చేస్తూ ఖచ్చితమైన ఒక టైంని ఫాలో అవ్వరు. కానీ ఇలా చేయడం వల్ల ఈ రకమైన ఇబ్బందులుంటాయి.

- లేటుగా భోజనం చెయ్యడం వల్ల పని మీద ఏకాగ్రత తగ్గిపోతుంది. అది దైనందిన జీవితాన్ని నెమ్మది చేసేస్తుంది. పనిచేసే చోట చికాకులు తప్పవు. అది మీ ఉద్యోగానికి ఎసరు పెట్టొచ్చు.

- రోజంతా నీరసంగా, బద్దకంగా ఉంటుంది. అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముంది.

- మగతగా, పని పట్ల హుషారు తగ్గిపోతుంది. ఇది మీ మేని ఛాయపైనా ప్రభావం చూపుతుంది.

- భోజనం లేటుగా తినడం వల్ల శృంగారపరమైన కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొనలేకపోవచ్చు. ఆరోగ్యకరమైన శృంగారానికి, సరైన భోజనం తప్పనిసరి అని తెలుసుకోవాలి.

- మొదట్లో వచ్చే సమస్యలు చిన్నవే అయినప్పటికీ, ఆహారం ఆలస్యం రొటీన్‌ అయిపోతే, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తప్పవు.

అందుకే బాగా ఆకలి వేశాక, ఆదరా బాదరాగా ఏదో ఒకటి కడుపులో పడేసకుకున్నాంలే అనకోకుండా, టైంకి భోజనం చేసి మిగతా టైంలో లైట్‌గా ఏదో ఒక చిరు తిండి తినడం వల్ల ఆరోగ్యానికే మంచిదే అంటున్నారు వైద్య నిపుణులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English