తయారీ చూస్తే అసహ్యం మందుబాబులకి అదే ప్రియం

తయారీ చూస్తే అసహ్యం మందుబాబులకి అదే ప్రియం

చీప్‌ లిక్కర్‌ (నాటు సారా) తయారీ ఎవరైనా చూస్తే ఇక దానిపై అసహస్యం పుట్టేస్తుంది. కడుపులో దేవేస్తుంది. పేగుల్ని బలవంతంగా ఎవరో లాగేసినట్టయిపోతుంది. కానీ ఆ తయారీ గుట్టు బయటకు రాదు. అందుకే ఆ సారా ఇచ్చే కిక్కులో పడి స్వర్గంలో ఉన్నట్టుగా ఫీలయిపోతారు మందుబాబులు. సారా తయారీ వెనుక కఠోర వాస్తవాలిలా ఉంటాయి.

- గుడుంబా తయారీ అత్యంత విషపూరితమైన పదార్థాలతో జరుగుతుంది.

- హానికరమైన రసాయనాలు (ఆల్డిహైడ్లు, కీటోన్లు, ఫ్యూజల్‌ ఆయిల్‌) వాడి నాటు సారాని తయారు చేస్తారు.

- ఒక కుండలో వందలీటర్ల నీరు తీసుకుంటే అందులో 35 కిలోల నల్లబెల్లం మూడు కిలోల స్పటిక అరకిలో నవాసారం యూరియా, జీడి గింజలు, కుళ్లిపోయిన పళ్లు, ఆహార వ్యర్ధాలు, వాడి పారేసిన చెప్పులు కూడా వేసి పులియబెడతారు.

- నాలుగు రోజుల అనంతరం దీన్ని మరగబెడితే సుమారు 25 లీటర్ల వరకూ గుడుంబా (నాటు సారా) ఉత్పత్తవుతుంది.
ఇదీ నాటు సారా / గుడుంబా తయారీ చరిత్ర. తాగితే స్వర్గంలోకి వెళ్ళడం మాటేమోగానీ, కిడ్నీలు డ్యామేజయిపోయి, లివర్‌ చెడిపోయి, శరీరం గుల్ల అయిపోవడం ఖాయం. పరుగులు పట్టిన కుళ్ళిపోయిన పళ్ళతో, విష రసాయనాలతో తయారుచేసే సారా, ఒంటిని గుల్ల చేయక ఆరోగ్యాన్నివ్వదు కదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు