ఇండియాలో టాప్‌ 5 'టెక్‌' మొనగాళ్ళు

ఇండియాలో టాప్‌ 5 'టెక్‌' మొనగాళ్ళు

సంస్కృతీ సంప్రదాయాల కోణంలో చూసినప్పుడు ప్రపంచంలోనే ఓ ప్రత్యేక స్థానం భారతదేశానికి దక్కుతుంది. గడచిన మూడు దేశాబ్దాల్లో భారతదేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సంస్కృతీ సంప్రదాయాల పరంగానే కాకుండా, టెక్నాలజీ పరంగా కూడా ప్రపంచ పటంలో భారతదేశం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. తమ మెదళ్ళకు పదును పెట్టి, ప్రపంచానికి తమ మేధస్సుని పంచి, ఆర్థికంగా తాము ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా, దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నారు మన 'టెక్‌' మొనగాళ్ళు. అందులో టాప్‌ 4 టెక్‌ బిలియనీర్‌ మొనగాళ్ళ గురించి మాట్లాడుకుందాం.

అజీమ్‌ ప్రేమ్‌ జీవిప్రో గ్రూప్‌ ఛైర్మన్‌ అయిన అజీమ్‌ ప్రేమ్‌జీ భారతదేశంలో 'టెక్‌' గురుగా అభివర్ణించబడతారు. బిజినెస్‌ టైకూన్‌గానే కాకుండా, మానవతా వాది కూడా అయిన ఈ విప్రో గ్రూప్‌ ఛైర్మన్‌ తన వ్యక్తిగత పొదుపులోంచి 25 శాతం మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. రానున్న రోజుల్లో మరో 25 శాతం సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మూడో వెల్తీయెస్ట్‌ ఇండియన్‌గా అజీమ్‌ ప్రేమ్‌జీ రికార్డులకెక్కారు. పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించిన అజీమ్‌ ప్రేమ్‌ జీ 15 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల సంపదను కలిగి వున్నారు.

శివ నాడార్‌తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలోగల మూలైపోజి అనే చిన్న గ్రామంలో జన్మించిన శివ నాడార్‌, 1967లో కూపర్‌ ఇంజనీరింగ్‌ అనే సంస్థను స్థాపించారు. 1976లో హెచ్‌సీఎల్‌ కంపెనీని ఒక లక్షా 87 వేల రూపాయలతో ప్రారంభించారు. ఇప్పుడు శివనాడార్‌ సంపద 17 యూఎస్‌ బిలియన్‌ డాలర్లు. కృషి, పట్టుదల ఉంటే సామాన్యుడు అద్భుతాలు సృష్టించగలడనడానికి శివనాడార్‌ కన్నా బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ ఇంకేం కావాలి?

సునీల్‌ మిట్టల్‌సునీల్‌ మిట్టల్‌ అనగానే భారతి ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌ గుర్తుకొస్తుంది. భారతి ఎయిర్‌టెల్‌ ఇండియాలో అతి పెద్ద టెలికాం కంపెనీ. 20 దేశాల్లో భారతి గ్రూప్‌ తన కార్యకలాపాల్ని కొనసాగిస్తోంది. కేవలం 18 ఏళ్ళ వయసులోనే తొలి బిజినెస్‌ని ఆయన ప్రారంభించారు. అదీ 1876లో. సునీల్‌ మిట్టల్‌ పంజాబ్‌లోని లూథియానాలో 1957లో జన్మించారు. పంజాన యూనివర్సిఈలో ఆయన విద్యాభాస్యం జరిగింది. హార్వార్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంఐటీ చదివారు సునీల్‌ మిట్టల్‌. ఈయన సంపద 7.3 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు.

ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తిఇన్ఫోసిస్‌ నారాయణమూర్తిగా దేశ ప్రజలకు సుపరిచితుడైన నాగవర రామారావు నారాయణమూర్తి, సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించడం ఓ అదృష్టంగా యువత భావించే స్థాయికి తన సంస్థను విస్తరించారాయన. 1981లో ఇన్ఫోసిస్‌ ప్రారంభమైంది. ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఐటీ సెక్టార్‌గా నారాయణమూర్తిని అభివర్ణిస్తారు. 1.9 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల సంపద కలిగి ఉన్న నారాయణమూర్తి, సేవా రంగంలోనూ తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు.

వేణుగోపాల్‌ ధూత్‌చెరుకు, కాటన్‌ వంటివాటికి సంబంధించిన వ్యాపారాలు నిర్వహించే కుటుంబం నుంచి వచ్చిన వేణుగోపాల్‌ ధూత్‌, వీడియోకాన్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థను స్థాపించారు. స్వతహాగా క్రికెట్‌కి వీరాభిమాని అయిన వేణుగోపాల్‌ ఆ మక్కువతోనే వీడియోకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ క్రికెట్‌ను కోల్‌కతాలో స్థాపించారు. ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం వేణుగోపాల్‌ సంపద 1.55 బిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు