సిబిఐ చిలక పలుకులు

సిబిఐ చిలక పలుకులు

జగన్‌ కేసులో కూడా సిబిఐ చిలకలా వ్యవహరిస్తోన్నదని వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ నేత కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. సిబిఐ న్యాయవాదులు కాంగ్రెస్‌ చెప్పమన్న చిలక పలుకులు చెప్పి కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. విజయమ్మ ఆలోచన మేరకు అంతా సంయమనం పాటించాలని తమ పార్టీ అబిమానులను కోరుతున్నామన్నారాయన. జగన్‌ త్వరలోనే బయటకు వస్తారని మీడియా ద్వారా పార్టీ శ్రేణులకు చెప్పారు.

మరో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ తీర్పు తమకు నిరాశ కలిగిందించదని అన్నారు. ఈసారి తప్పనిసరిగా బెయిల్‌ వస్తుందని అంతా ఆశించారని, కాని సుప్రింకోర్టు సిబిఐ విచారణ కోసం నాలుగు నెలల గడువు ఇచ్చిందని అన్నారు. వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరచడానికి చేస్తున్న ప్రయత్నంగానే ఈ తీర్పును చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ శ్రేణులు మరింత కసిగా పనిచేయాలని అంబటి పిలుపు ఇచ్చారు.

సంవత్సరం పాటు జైలులో ఉంచితే పార్టీ దెబ్బతింటుందని అనుకున్నారని, అది జరగలేదు అని, ఇప్పుడు ఇంకా దృఢ సంకల్పంతో కార్యకర్తలు నేతలు పనిచేస్తారని అన్నారు అంబటి. సిబిఐ తరపు న్యాయవాది ప్రభుత్వ న్యాయవాదిగా కాకుండా కాంగ్రెస్‌ తరపు న్యాయవాదిగా మాట్లాడారని అంబటి రాంబాబు విమర్శించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు