పిల్ల కాంగ్రెస్‌ పిల్ల చేష్టలు

పిల్ల కాంగ్రెస్‌ పిల్ల చేష్టలు

తనపై లేని పోని ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పిల్ల కాంగ్రెస్‌ నాయకులు తాను ఢిల్లీలో ఉండడం గురించి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

కుంభకోణాలపై ప్రభుత్వాలు నామమాత్రంగా ఉంటే కోర్టులే పట్టించుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. దేశంలో ఆర్దిక నేరాలు పెరిగిపోయాయని, ఇలాంటి కేసులో కఠినంగా వ్యవహరించాలని సుప్రింకోర్టు జగన్‌ కేసు విచారణ సందర్భంలో అభిప్రాయపడిందనని చంద్రబాబు అన్నారు. పిల్ల కాంగ్రెస్‌ నాయకులు తనపై అసత్య ఆరోపణలు చేశారని, ఇది ఏ రకంగా సబబు అని చంద్రబాబు ప్రశ్నించారు.

మోకాలి నొప్పులతో బాధపడుతున్న తాను ఢిల్లీలో వైద్య చికిత్స చేయించుకున్నానని, దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని కోర్టులను ప్రభావితం చేసేలా వ్యవహరించానని తనపై ఆరోపణలు చేయడం వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకి తగదన్నారు. ఇవి పిల్ల చేష్టల్లాంటివన్నారాయన.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు